హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కోల్‌కతాను 9వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట టాస్ గెలిచిన హైదరాబాజ్ జట్టు బౌలింగ్‌కే మొగ్గుచూపడంతో బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. ఓపెనర్ లిన్ 51 పరుగులు చేయగా ఆ తర్వాత రింకు సింగ్ 30, సునీల్ నరైన్ 25 పరుగులు రాబట్టడంతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, భువనేశ్వర్ 2, రషీద్‌ఖాన్, సందీప్‌శర్మ చెరో వికెట్ తీశారు.
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 15 ఓవర్లలోనే 161 పరుగులు చేసి కోల్‌కతా జట్టును చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 80 పరుగులు సాధించగా, డేవిడ్ వార్నర్ 67 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్ 4 జట్లలో చేరినట్టయింది.
కోల్‌కతాను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్