ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ( Kings XI Punjab ) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) 69 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన పంజాబ్ ( KXIP ).. మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 132 పరుగులకే ఆలౌట్ అయింది.
ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు.
ICC ODI Rankings | భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడకున్న విరాట్ కోహ్లీ నెంబర్ వన్, రెండో ర్యాంకులో రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.
ఇంగ్లండ్ జట్టు తొలిసారిగా ఐసిసి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఫైనల్స్ వరకు వచ్చిన ఆ జట్టు ఈసారి ఏకంగా కప్‌నే ఎగరేసుకుపోయింది.