Suryakumar Yadav: కిందపడినా సిక్సర్ ఎలా కొడుతున్నాడు..? సీక్రెట్ చెప్పేసిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav in Sri Lanka Series: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమవ్వగా.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ.. చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఆడాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. కిందపడినా సిక్సర్ ఎలా కొట్టగలగుతున్నాడో చెప్పేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 12:52 PM IST
Suryakumar Yadav: కిందపడినా సిక్సర్ ఎలా కొడుతున్నాడు..? సీక్రెట్ చెప్పేసిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav in Sri Lanka Series: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తుఫాను ఇన్నింగ్స్ అభిమానులను ఉర్రూతలూగించింది. స్టేడియంలో ప్రేక్షుకులు సూర్య.. సూర్య అంటూ మ్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేయగా.. టీవీల ముందు ఆడియన్స్ కేకలతో మోత మోగించారు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ సూర్య చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కేవలం 51 బంతుల్లోనే 9 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 16.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. 

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మైదానం చుట్టూ సిక్సర్లు, ఫోర్లు బాదాడు. కొన్ని షాట్లు పడుకుని.. పడిపోయినా తర్వాత కూడా బంతిని బౌండరీ వెలుపలకు దాటించాడు. మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గేమ్‌కు రెడీ అవుతున్నప్పుడు తనపై తాను ఒత్తిడి పెంచుకుంటానని చెప్పాడు. ఎంత ఒత్తిడి ఉంటే అంత ఆట మెరుగుపడుతుందన్నాడు. 

'మెరుగైన ప్రాక్టీస్ సెషన్ల కారణంగా నా బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఈరోజు నేను ఆడిన ఇన్నింగ్స్ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. కెప్టెన్ కూడా నాపై విశ్వాసం వ్యక్తం చేశాడు. నేను ఆడిన షాట్‌లలో కొన్ని ముందుగా ఫిక్స్ అయినవే. నేను ఆడిన ఈ మ్యాచ్‌లో ఆడియన షాట్లే గత ఏడాది కాలంగా నేను ఆడుతున్నాడు. ఇందులో తేడా ఏమీ లేదు. వెనుక బౌండరీ తక్కువగా ఉండడంతో ఆ దిశగా షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. 

అయితే క్రీజ్‌లో ఉన్నప్పుడు రకరకాల షాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. గ్యాప్‌ని దృష్టిలో ఉంచుకుని ఫీల్డ్‌కు అనుగుణంగా షాట్‌లను ఎంచుకున్నాను. 2022 గడిచిపోయింది. ఇది 2023లో కొత్త ప్రారంభం. నేను బాగా ఆడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. కోచ్ రాహుల్ ద్రవిడ్ నా ఆట ఆడేందుకు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు..' అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో సూర్య పలు రికార్డులు తన పేరటి లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడు సెంచరీలో సాధించిన నాన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ మూడు టీ20 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా సూర్యనే. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్, మన్రో (3)లను సమం చేశాడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. కేవలం 843 బంతుల్లో 1500 పరుగులు చేయడం విశేషం.

Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  

Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News