T20 World Cup 2022 Group 1 Semi-Final Scenario: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 దశలో అన్ని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఓడిపోవడంతో గ్రూప్ 2 రేసు రసవత్తరంగా మారగా.. మంగళవారం న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం సాధించడంతో గ్రూప్ 1 కూడా రసవత్తరంగా మారింది. ప్రస్తుతం గ్రూప్ 2 కంటే.. గ్రూప్ 1 సెమీస్ రేసు ఆసక్తిగా ఉంది. గ్రూప్ 1లోని టీమ్‌లు సెమీస్‌కు చేరుకోవాలంటే.. చివరి మ్యాచ్ కీలకంగా మారనుంది. గ్రూప్ 1 సెమీస్ సమీకరణాలను ఓసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం గ్రూప్ 1లోని న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు నాలుగేసి మ్యాచులు ఆడాయి. న్యూజిలాండ్ రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో 5 పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో 5 పాయింట్లు సాధించింది. ఆస్ట్రేలియా రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో 5 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. శ్రీలంక రెండు విజయాలు, రెండు ఓటములతో 4 పాయింట్లు సాధించింది.
ఐర్లాండ్ ఒక విజయం, రెండు ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. అఫ్గానిస్థాన్ రెండు ఓటములు, రెండు మ్యాచ్‌లు రద్దతో కేవలం 2 పాయింట్స్ మాత్రమే సాధించింది. అఫ్గాన్‌కు సెమీస్ అవకాశాలు లేవు. ఐర్లాండ్‌కూ దాదాపు అవకాశాలు లేనట్టే. అయితే ఈ రెండు జట్లూ ఇతర టీమ్‌ల ఛాన్స్‌లను ప్రభావితం చేయగలవు. ఇక ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే.. సెమీస్ బెర్తు ఖాయం అవుతుంది.
అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్‌కు చేరుతుంది. అయితే లంక విజయం సాధిస్తే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో లంక సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే.. నెట్‌రన్‌రేట్ ఆధారంగా కివీస్ మాత్రమే సెమీస్‌కు చేరుకొంటుంది. అప్పుడు లంక సెమీస్ బెర్తు దక్కించుకొంటుంది.
ఒకవేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే.. నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఏడేసి పాయింట్లతో ఉన్న ఈ మూడు జట్లలో రన్‌రేట్ అధికంగా ఉన్న రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. అప్పుడు అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, శ్రీలంక సహా ఇంకో జట్టు మెగా టోర్నీ నుంచి తప్పుకుంటాయి.
Also Read: జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. గంటన్నర తర్వాత అదుపులోకి మంటలు!
Also Read: India Vs Bangladesh: రేపు బంగ్లాతో భారత్ ఢీ.. పంత్ ప్లేస్‌పై రాహుల్ ద్రావిడ్ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook