శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ వికాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 50వ సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్‌లో 32 సెంచరీలు...టెస్టుల్లో ఇది 18వ సెంచరీ. దీంతో అంతర్జాతీయ కెరీలో మొత్తం 50 సెంచరీలు నమోదు చేసుకున్నాడు విరాట్. భారత్ తరఫున సచిన్ ఒక్కడే ఈ మార్క్ సాధించగల్గాడు. సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) ఎవ్వరికీ అందనంత స్థిలో నిలవగా.. తర్వత క్రికెట్‌లో 50 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో టీమిండియా క్రికెటర్ గా నిలిచాడు మన కోహ్లీ.
ఓవర్ ఆల్ గా చూసినట్లయితే... ప్రపంచ క్రికెట్‌లో ఈ ఇద్దరూ కాకుండా పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనె (54), లారా (53) అంతర్జాతీయ క్రికెట్‌లో 50కిపైగా సెంచరీలు చేశారు. అయితే తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించింది మాత్రం కోహ్లీయే. కాగా 50 సెంచరీలు చేసిన కోహ్లీని సహచర క్రికెటర్లతో సహా పలువులు మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు కోహ్లీ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకుంటున్నారు.