ఇండియా vs వెస్ట్ ఇండీస్ T20I సిరీస్‌: కోహ్లి, ధోనికి రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ

Last Updated : Oct 27, 2018, 01:33 PM IST
ఇండియా vs వెస్ట్ ఇండీస్ T20I సిరీస్‌: కోహ్లి, ధోనికి రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ

ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన అనంతరం అదే జట్టుతో టీమిండియా మరో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 ఇంటర్నెషనల్ సిరీస్ కోసం తాజాగా బీసీసీఐ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ సిరిస్‌ నుంచి కెప్టేన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టేన్‌గా ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లతో వరుస సిరీస్‌లు జరగనున్న నేపథ్యంలోనే బీసీసీఐ ఈ టీ20 సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. కోహ్లీతోపాటు మహేంద్ర సింగ్ ధోనికి సైతం ఈ సిరీస్ నుంచి విశ్రాంతి లభించింది.

విండీస్‌తో T20I సిరీస్‌లో తలపడనున్న టీమిండియా జట్టు :
రోహిత్ శర్మ (కెప్టేన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, డీకే, మనీశ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కునాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ర్పిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మెద్, ఉమేష్ యాదవ్, షాహబాజ్ నదీమ్. 

Trending News