Team India Squad For WTC Final: ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు టీమిండియాను ప్రకటించిన BCCI

Team India Squad For WTC Final against New Zealand: ఒక్కో దేశంలో సిరీస్‌లు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది భారత క్రికెట్ జట్టు. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 18, 2021, 09:01 AM IST
  • నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం
  • సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ మైదానం ఇందుకు వేదికగా మారింది
  • సిరాజ్, మయాంక్ అగర్వాల్‌లకు తుది జట్టులో దక్కని చోటు
Team India Squad For WTC Final: ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు టీమిండియాను ప్రకటించిన BCCI

Team India Playing XI For WTC Final: టెస్టుల్లో గతంలో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచే జట్టుకు ఐసీసీ గదను, ప్రైజ్‌మనీ ఇచ్చి సత్కరించేంది. ఈ క్రమంలో 2009లో తొలిసారిగా టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. ఆ తరువాత ఒక్కో దేశంలో సిరీస్‌లు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది భారత క్రికెట్ జట్టు. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేటి (జూన్ 18) నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final)కుగానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 11 మంది ఆటగాళ్లలో కూడిన టీమిండియాను ఒకరోజు ముందుగానే ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌ కాగా, అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అందరూ అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. అయితే మాయంక్ అగర్వాల్‌కు చోటు దక్కకపోవడంపై అభిమానులు నిరాశచెందారు. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతుంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ ఇద్దరికీ అవకాశం ఇచ్చింది.

Also Read: WTC Final 2021: ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో బౌలింగ్‌కు సై అంటున్న Team India కెప్టెన్ Virat Kohli

పేస్ బౌలర్లలో హైదరాబాదీ, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నిలకడగా ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కలేదు. అనుభవానికే బీసీసీఐ, టీమిండియా (Team India) మేనేజ్‌మెంట్ పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం అధికంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు తుది జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సేవలు అందించనున్నాడు. చతేశ్వర్ పుజారా, రహానే, కోహ్లీ, రోహిత్ శర్మలు బ్యాటింగ్ బారాన్ని మోయనున్నారు. సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ మైదానంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also Read: ICC WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, Team Indiaలో ఆందోళన పెంచుతున్న కివీస్ రికార్డులు

భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News