Leander Paes Retirement: భారత టెన్నిస్ చరిత్రలో లియాండర్ పేస్ ఓ ప్రత్యేక అధ్యాయం. 1991లో ప్రొఫేషనల్ ప్లేయర్ గా మారిన లియాండర్ పేస్.. 30 ఏళ్లలో దేశం తరఫున ఎన్నో విజయాలు అందుకున్నాడు. లియాండర్ పేస్ (Leander Paes News).. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించాడు. అంతర్జాతీయ ప్లేయర్లైన తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు అడుగులేశాడు. చిన్నతనంలోనే రాకెట్ పట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. జూనియర్ స్థాయిలోనే సంచలనాలు నమోదు చేశాడు. యుఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ గెలిచి జూనియర్ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు లియాండర్ పేస్. అప్పుడే అతనిలోని సత్తా ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అతని రాకెట్‌కు తిరుగు లేకుండా పోయింది.
సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మరపురాని విజయాలు సాధించిన అతను.. 2020 టోక్యో ఒలింపిక్స్ ఆడిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని గతంలో ప్రకటించాడు. కానీ కరోనా కారణంగా ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం వల్ల ఇన్ని రోజులు మౌనంగానే ఉండిపోయాడు. తాజాగా టీఎంసీలో చేరడంతో (Leander Paes Joins Trinamool) టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకున్నట్లు ప్రకటించాడు.
పతకం సాధించిన ఏకైక ఆటగాడు లియాండర్
17 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా లియాండర్ పేస్ అవతరించాడు. ఆ తర్వాత 22 ఏళ్లకే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ టెన్నిస్‌లో భారత్‌కు పతకం అందించిన ఏకైక ఆటగాడిగా పేస్ కొనసాగుతున్నాడు. 1992 నుంచి 2016 వరకూ వరుసగా ఏడు ఒలింపిక్స్‌ల్లో పాల్గొన్న తొలి టెన్నిస్ ప్లేయర్‌గా, ఏకైక భారత అథ్లెట్‌గా అతను నిలిచాడు.
డబుల్స్ ఆటగాడిగా అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. టెన్నిస్ డబుల్స్ విభాగానికి పర్యాయ పదంగా మారిన అతను.. తన కెరీర్‌లో ఏకంగా 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు. అందులో 10 మిక్స్‌డ్ డబుల్స్‌లో, 8 పురుషుల డబుల్స్‌లో నెగ్గాడు. ఈ రెండు విభాగాల్లోనూ కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించాడు. ఇక డేవిస్ కప్ చరిత్రలోనే 45 డబుల్స్ విజయాలతో ఆల్‌టైమ్ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. దేశ క్రీడా అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్నను (Leander Paes Awards) దక్కించుకున్న అతను.. మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. టెన్నిస్‌లో దిగ్గజంగా ఎదిగిన పేస్.. ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించాడు. టెన్నిస్ ఆటగాడిగా (Leander Paes Retirement) రాకెట్ పట్టి కోర్టులో సంచలనాలు నమోదు చేసిన అతను.. రాజకీయ నాయకుడిగా తన రెండో ఇన్నింగ్స్‌లో విజయవంతం అవుతాడేమో చూడాలి.
Also Read: T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
Also Read: Afg vs Pak Match Highlights: టీ20లో హ్యాట్రిక్ కొట్టిన పాక్.. ఆఫ్గనిస్తాన్‌పై పాక్ ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook