టోక్యో ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన రవి కుమార్ దహియా

Ravi Kumar Dahiya in wrestling finals: టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో 13వ రోజైన బుధవారం రెజ్లింగ్ వీరుడు రవి కుమార్ దహియా 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో తన ప్రతిభను చాటుకుని ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో రెజ్లర్ రవి కుమార్ దహియ రూపంలో భారత్‌కు మరో ఒలింపిక్ పతకం (Olympic medal) ఖాయమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2021, 04:37 PM IST
టోక్యో ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన రవి కుమార్ దహియా

Ravi Kumar Dahiya in wrestling finals: టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో 13వ రోజైన బుధవారం రెజ్లింగ్ వీరుడు రవి కుమార్ దహియా 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో తన ప్రతిభను చాటుకుని ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో రెజ్లర్ రవి కుమార్ దహియ రూపంలో భారత్‌కు మరో ఒలింపిక్ పతకం (Olympic medal) ఖాయమైంది. సెమీ ఫైనల్‌లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన కుస్తీ పోటీలో విజయం సాధించి ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ సుశీల్ కుమార్ (2012 లండన్ ఒలింపిక్స్) తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

 

నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో (Wrestling) తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగిన రవికుమార్ దహియా.. బ్రేక్ తర్వాత డీలాపడ్డాడు. సనయెవ్ ఏకంగా 8 పాయింట్స్ సాధించి 2-9 తేడాతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత రవికుమార్ ఐదు పాయింట్స్ సాధించడం ద్వారా ఆ తేడాను 7-9 కు తగ్గించాడు. ఆ తర్వాత సనయెవ్‌పై గెలిచి ఫైనల్‌కి అర్హత సాధించాడు.

Also read : టోక్యో ఒలింపిక్స్‌: పీవీ సింధుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics 2020) మొదట నైజీరియాకు చెందిన ఎకెరెకెమె అగియోమోర్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన రవి కుమార్.. క్వార్టర్ ఫైనల్స్‌లో బల్గేరియాకు చెందిన జార్గీ వెంగెలోవ్‌పై చెలరేగి 14-4 తేడాతో భారీ విజయం సొంతం చేసుకున్నాడు. అలా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన రవికుమార్ దహియ (Ravi kumar Dahiya) ఇక్కడ కూడా విజయం కైవసం చేసుకున్నాడు.

Also read : అక్కడి జిమ్‌కు వెళ్లాలంటే పిచ్చి పీక్స్‌కు చేరే నిబంధనలన్నీ పాటించాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News