PV Sindhu gets grand welcome after returning to India from Tokyo Olympics 2020: న్యూ ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో కాంస్య పతకం గెల్చుకుని భారత్‌కి తిరిగొచ్చిన పీవీ సింధుకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ మెడల్‌తో దేశం చేరుకున్న పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (SAI) చెందిన ఇతర అధికారులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అలాగే విమానాశ్రయం సిబ్బంది, సెక్యురిటీ ఫోర్స్ పీవీ సింధుకు హర్షద్వానాల మధ్య స్వాగతం పలికారు.
#WATCH PV Sindhu and her coach welcomed at the Delhi airport; Sindhu bagged a bronze medal in women's singles badminton at #TokyoOlympics pic.twitter.com/6UORPFX851
— ANI (@ANI) August 3, 2021
Also read: పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ఫోటోస్ గ్యాలరీ
పీవీ సింధుతో పాటు ఆమెకు శిక్షణ ఇచ్చిన కొరియన్ కోచ్ పార్క్ టే-సంగ్‌కు (PV SIndhu's coach Park Tae-sang) అజయ్ సింఘానియా ఎయిర్ పోర్టులోనే ఘనంగా సత్కరించారు.
#WATCH "I am very happy and excited. I am thankful to everyone including the Badminton Association for supporting and encouraging me. This is a happy moment," says #Olympics medallist PV Sindhu on her return to India pic.twitter.com/xfoL63Zzd8
— ANI (@ANI) August 3, 2021
Also read : పివి సింధు ఫ్యామిలీ అండ్ పేరెంట్స్: అక్క కొడుకుతో పివి సింధు ఆటలు
ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెల్చుకోవడమే కాకుండా రెండు ఒలింపిక్స్ మెడల్స్ గెల్చుకున్న తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు చరిత్ర (PV Sindhu) సృష్టించింది. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించి ప్రోత్సహించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Also read : ఒలింపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook