ఐపీఎల్ నిర్వహణకు తాము రెడీ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా మహమ్మరి ఆందోళనలో ఈ ఏడాది ఎప్రిల్‌లో

Last Updated : May 11, 2020, 10:42 PM IST
ఐపీఎల్ నిర్వహణకు తాము రెడీ..

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా మహమ్మరి ఆందోళనలో ఈ ఏడాది ఎప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ భారత క్రికెట్ బోర్డు నిరవధికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో ఈసారి ఐపీఎల్ నిర్వహించే పరిస్థితి లేదని నిర్వాహకులు చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారడంతో ఈ సమయంలో తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించేందుకు తాము సిద్ధమేనని అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. 

అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో యుఎఇ ఐపిఎల్‌కు ఆతిథ్యం ఇచ్చిన అనుభవమున్న నేపథ్యంలో ఆలోచన మొదలయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2014లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను యుఎఇలో నిర్వహించారు. ఈసారి కూడా తాము ఐపీఎల్ నిర్వహిస్తామని యుఎఇ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంతకుముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్ నిర్వహణకు తాము సిద్ధమేనని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News