జైపూర్: ఐపీఎల్ 2019 సీజన్ కోసం నేడు జైపూర్లో కొనసాగుతున్న ఐపీఎల్ వేలం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పలువురు సీనియర్ టాప్ ప్లేయర్లను వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయకపోగా.. ఇంకొంతమంది యువ ఆటగాళ్లు భారీ ధర పలుకుతూ పరిశీలకులను ఔరా అనిపించేలా చేస్తున్నారు. అదే విధంగా నేటి వేలంలో మరో యువ క్రికెటర్ కనీస ధర కన్నా ఊహించని మొత్తం పలికి తన సత్తాను చాటుకున్నాడు. అతడు ఎవరో కాదు.. తమిళనాడుకు చెందిన యంగ్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి.
Also read : IPL 2019 Auction : వారెవ్వా.. రూ.8.40 కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్!
వేలంలో రూ.20 లక్షల కనీస కలిగిన వరుణ్ చక్రవర్తి.. భారీ ఫోటీ మధ్య రూ.8.40 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇది అతడి కనీసం ధరకు 42 రెట్లు అధికం కావడం విశేషం. వేలంలో ఇతర జట్లతో పోటీ పడి మరీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ చక్రవర్తిని తమ సొంతం చేసుకుంది. వరుణ్ చక్రవర్తి ప్రతిభకు దక్కిన గౌరవం పలువురు అభివర్ణిస్తున్నారు.
Also read : IPL Auction 2019: రూ.2 కోట్లు పలికిన తెలుగు యువకెరటం హనుమ విహారి