ఆసియా క్రీడల్లో భారత్‌ను మరో స్వర్ణం వరించింది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేష్ పోగట్, జపాన్ ప్రత్యర్థిపై 6-2 తేడాతో గెలుపొంది బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. సెమీస్‌లో కూడా ఉజ్బెకిస్తాన్‌కి చెందిన దౌలత్ బైక్ యక్షిమురతోవాతో కూడా వినేష్ పోగట్‌కి ఆసక్తికరమైన పోరే జరిగింది. ప్రత్యర్థిని కేవలం 75 సెకన్లలోనే 10-0 స్కోరుతో ఓడించిన వినేష్.. క్వార్టర్స్‌లో కూడా దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యెంగ్‌జూని 11-0 తేడాతో ఓడించింది.
అయితే ఈ సారి సాక్షి మాలిక్, పూజా దండా మొదలైన మహిళా రెజర్లు అంత ఆశాజనకమైన ప్రదర్శనను కనబరచలేకపోయారు. ప్రముఖ రెజ్లర్లు గీతా పోగట్, బబితా పోగట్‌లకు స్వయానా కజిన్ అయిన వినేష్ పోగట్ గతంలో కూడా పలుమార్లు భారత్‌కు అంతర్జాతీయ పతకాలు తీసుకువచ్చారు.
2014 కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలుపొందిన వినేష్ పోగట్.. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 50 కేజీల విభాగంలో కూడా స్వర్ణం గెలుచుకున్నారు. అదేవిధంగా 2013 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం పొందిన వినేష్.. 2015, 2016, 2017, 2018ల్లో జరిగిన ఛాంపియన్‌షిప్‌ల్లో కూడా వరుసగా రజతం, కాంస్యంతో పాటు మళ్లీ రెండు రజత పతకాలు అందుకున్నారు. మహవీర్ సింగ్ పోగట్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న వినేష్ పోగట్ హర్యానాలోని బలాలి ప్రాంతంలో పుట్టి పెరిగారు.