virat kohli shares first glimpse of new luxurious alibaug house: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తన డ్రీమ్ హౌస్ ను పంచుకున్నాడు. తన అభిమానులు ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యేలా విరాట్ చేశారు. అలీబాగ్ లోని తన లగ్జరీ ఇల్లును పూర్తిగా వీడియోతీసి స్వయంగా అందరికి చూపెడుతు తెగ సంబరపడ్డారు. ఈ ఇల్లు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచాక..తన ఫ్యామిలీతో కలిసి విరాట్ లండన్ లో సేదతీరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇంకా కొన్నిరోజుల పాటు ఆయన లండన్ లో ఉంటారని సమాచారం. అంతేకాకుండా.. శ్రీలంకతో జరిగే సిరిస్ లో ఆయన పాల్గొనరు. భారత్, బంగ్లా దేశ్ తో జరిగే మ్యాచ్ లో ఆయన పాల్గొంటారు.
ఇదిలా ఉండగా.. తన ఇల్లుకు సంబంధించిన వీడియో అభిమానులతో పంచుంటూ ఈ ఇల్లుకట్టిన సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ ఫ్యామిలీ ఏవిధంగా ఇల్లు ఉండాలనుకున్నామో.. అచ్చం అలాగే ఉందని కూడా విరాట్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంటీరియర్ డిజైన్స్, ఎయిర్ స్పెస్, ప్రతి ఒక్కటి కూడా తాను ఊహించిన విధంగానే ఉన్నాయంటూ విరాట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు బెంగళూరు పోలీసులు.. విరాట్ కు చెందని ఒక పబ్ పైన దాడిచేశారు. దాని మ్యానెజర్ పైన కేసుకూడా నమోదు చేశారు.
అర్ధరాత్రిళ్లుకూడా పబ్ లు తెరిచేఉంటున్నట్లు పోలీసులకు అక్కడున్న వారు కంప్లైంట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. వన్ 8 కమ్యూన్ మాత్రమే కాకుండా సెంట్రల్ డివిజన్ పరిధిలో కాలపరిమితి దాటి వ్యాపారం చేస్తున్న మరికొన్ని రెస్టారెంట్లు, పబ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు.
Read more:Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
టీ20 ముగియగానే..అనుష్క శర్మ, వామికా, అకాయ్ లండన్ లోనే ఉండటంతో, విరాట్ కోహ్లీకూడా అక్కడికి వెళ్లిపోయారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు చెందిన పబ్ పై కేసు నమోదు కావడం మాత్రం హట్ టాపిక్ గామారింది. వన్ 8 కమ్యూన్ మెనెజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో నగరాలైన, ఢిల్లీ, ముంబాయి, పుణె, కోల్ కతా లలో కూడ వన్8 కమ్యూన్ బ్రాంచ్ లు ఉన్నాయి. బెంగళూరు పబ్ ను గతేడాది డిసెంబర్ లో స్టార్ట్ చేసినట్లు సమాచారం.