Virat Kohli, Anushka Sharma pics: అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ ఫోటో పోస్ట్

Virat Kohli, Anushka Sharma's romantic pics: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంట మీడియా ప్రపంచంలో ఓ హిట్ పెయిర్. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. విరాట్ కోహ్లీ కానీ లేదా అనుష్కా శర్మ ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేసుకున్నారంటే.. అది క్షణాల్లో వైరల్ అవడమే కాదు.. క్షణాల వ్యవధిలో మిలియన్స్ కొద్ది లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చిపడుతుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 07:00 PM IST
  • విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన రొమాంటిక్ ఫోటోకు మిలియన్లలో లైక్స్
  • సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విరుష్క జంట
  • వీలు చిక్కినప్పుడల్లా గారాలపట్టి వామిక కోహ్లితో టైమ్ ఎంజాయ్ చేస్తోన్న జంట
Virat Kohli, Anushka Sharma pics: అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ ఫోటో పోస్ట్

Virat Kohli, Anushka Sharma's romantic pics: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంట మీడియా ప్రపంచంలో ఓ హిట్ పెయిర్. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. విరాట్ కోహ్లీ కానీ లేదా అనుష్కా శర్మ ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేసుకున్నారంటే.. అది క్షణాల్లో వైరల్ అవడమే కాదు.. క్షణాల వ్యవధిలో మిలియన్స్ కొద్ది లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చిపడుతుంటాయి. అలాంటి ఫోటోనే ఒకటి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది. 

విరాట్ కోహ్లీ తన బెటర్ హాఫ్ అనుష్కా శర్మతో సరదాగా ఓ నీటి ప్రవాహం ఒడ్డున కలిసి తీసుకున్న రొమాంటిక్ ఫోటోను (Virat Kohli's photos) ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆ ఫోటోకింద ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చాడు. నువ్వు నా పక్కన ఉంటే.. ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అంటూ తన మనసులోని భావాన్ని చెప్పుకొచ్చాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

Also read : IND vs NZ: తొలి టెస్టు డ్రా.. టీమిండియా విజయాన్ని అడ్డుకున్న రవీంద్ర! అభిమానుల్లో టెన్షన్ పెంచిన అంపైర్!

విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫోటోకు ఇప్పటికే 4.2 మిలియన్ల మంది లైక్ కొట్టగా.. ఇంకా కొన్ని వేల మంది ఆ ఫోటో గురించి కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

విడివిడిగానే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

Virat-Kohli-with-his-wife-Anushka-sharma-spending-quality-time

అందుకే విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మల జంటకు సంబంధించిన ప్రతీ కదలిక (Virat Kohli, Anushka Sharma photos) సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారుతుంది.

విరాట్ కోహ్లీ అంటే అనుష్కా శర్మకు ప్రాణం. అనుష్క అంటే విరాట్ కోహ్లీకి కూడా అంతే ఇష్టం. అందుకే ఆ ఇద్దరి మధ్య బంధం అలా అందంగా ముందుకు సాగిపోతోంది. 

Also read : Ravichandran Ashwin: హర్భజన్ రికార్డు బద్దలు.. మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి అశ్విన్! ముత్తయ్య తర్వాత అత్యంత వేగంగా!!

అనుష్కా శర్మతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ ఫోటోలు

విరాట్ కోహ్లీ విదేశాల్లో క్రికెట్ ఆడాల్సి వచ్చినప్పుడు వీలైతే అతడికి తోడుగా అనుష్క (Anushka Sharma) కూడా వెళ్తుంది. కోహ్లీకి దగ్గరే ఉండి చీరప్ చెబుతుంది. అతడిలో జోష్ వచ్చేలా కంపెనీ ఇస్తుంది.

అనుష్క శర్మ ఓవైపు తన సినిమా షూటింగ్స్ చూసుకుంటూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా విరాట్ కోహ్లీతో సమయం గడపడానికే ఇష్టపడుతుంది.

మరోవైపు విరాట్ కోహ్లీ కూడా అంతే. వరుస టూర్లతో సతమతమవుతున్నప్పటికీ.. బ్రేక్ దొరికినప్పుడల్లా అనుష్కతో ఉండటానికే ఇష్టపడతాడు.

Virat Kohli, Anushka Sharma pics

ప్రస్తుతం ఈ లవ్లీ కపుల్ తమ గారాలపట్టి వామికా కోహ్లీతో (Virat Kohli's daughter Vamika kohli photos) టైమ్ స్పెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

Also read : Mumbai Test: రెండో టెస్టులో అతడిపై వేటు వేసి.. ఓపెనర్‌గా సాహాను ఆడించండి: జాఫర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x