Yashasvi Jaiswal: రాంచీ టెస్టులో హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన యశస్వి..

Ind vs Eng 04th Test: టీమిండియా యువ క్రికెటర్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా యశస్వి దిగ్గజాలు సరసన చోటు సంపాదించాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 07:48 PM IST
Yashasvi Jaiswal: రాంచీ టెస్టులో హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన యశస్వి..

Yashasvi Jaiswal in elite list : ఇంగ్లండ్ సిరీస్‌లో దుమ్మురేపుతున్న భార‌త యువ సంచలనం య‌శ‌స్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వి.. రాంచీ టెస్టులో విలువైన హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో ఈ సిరీస్ లో 600 పరుగుల మార్కును దాటాడు. తద్వారా ఒకే సిరీస్‌లో అత్య‌ధిక రన్స్ చేసిన క్రికెట్ దిగ్గజాలు సరసన చోటు సంపాదించాడు. ఈ లిస్ట్ లో డాన్ బ్రాడ్‌మ‌న్, గ్యారీ సోబర్స్, సునీల్ గవాస్కర్ వంటి వారున్నారు. 

ఒకే టెస్టు సిరీస్‌లో ఆరొంద‌ల‌కు పైగా ర‌న్స్ కొట్టిన ఆరో బ్యాటర్ గా యశస్వి(618) నిలిచాడు. తొలి స్థానంలో . క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మ‌న్ ఉన్నాడు. 1930లో ఇంగ్లండ్ పై 974 రన్స్ చేశాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గ్యారీ సోబర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 1957-58 మ‌ధ్య పాకిస్థాన్‌పై 824 రన్స్ చేశాడు. టీమిండియా దిగ్గజం సునీల్ గ‌వాస్క‌ర్ 1970-71లో వెస్టిండీస్‌పై 774 పరుగులు చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 2003లో ఇంగ్లండ్‌పై 714 ర‌న్స్ బాది నాలుగో స్థానంలోనూ, జార్జ్ హెడ్లే ఇంగ్లండ్‌పై 703 ప‌రుగుల‌తో ఐదో స్థానంలోనూ, నీల్ హ‌ర్వే దక్షిణాఫ్రికాపై 660 పరుగులతో ఐదో స్థానంలోనూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆరో ఫ్లేస్ లో ఉన్న యశస్వి ఇంగ్లండ్ తో సిరీస్ ముగిసే లోపు టాప్-4లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. 

రాంచీ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(73) హాఫ్ సెంచ‌రీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 134 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఇంగ్లండ్ యువ‌ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ నాలుగు వికెట్లు తీశాడు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్(30 నాటౌట్), కుల్దీప్ యాద‌వ్(17 నాటౌట్) ఉన్నారు. 

Also Read: Karnataka Cricketer: ఇండియన్ క్రికెట్ లో విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి..

Also read: Ranchi Test Live: ముగిసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్.. ఆదిలోనే భారత్ కు ఎదురుదెబ్బ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News