తెలంగాణలో తన ప్రజా యాత్రను ప్రారంభించిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేతకు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌ల నుంచి మెగా సపోర్ట్ లభించింది. పవర్ స్టార్ వెంటే మేము అంటూ బాబాయ్‌కి, అంకుల్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా హీరోలు ట్విటర్ ద్వారా తమ మద్దతు తెలియజేశారు.
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరిచర్చికి తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జనసేన పార్టీలో పార్లమెంటు స్థాయి సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కమిటీల ఏర్పాటును డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని చెప్పారు. కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీలో కొత్తవారికి ప్రాధ్యాన్యత ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లోని 42 లోక్‌సభ స్థానాల పరిధిలో 848 మందిని ఎంపిక చేశామని, వీరి శిక్షణ డిసెంబర్లో అయిపోతుందని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను రెండు విడతలుగా ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
జనసేన పార్టీ త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనుంది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్టీ పరిపాలన కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం జరిగింది. ముఖ్యంగా వచ్చే ఆరు నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్యమైన కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ ప్లినరీ సమావేశం, సభ్యత్వ నమోదు రెండు రాష్ట్రాల్లో పవన్ పర్యటనతో పాటు ఇతర ముఖ్య విషయాలపై నిర్ణయాలను ఖరారు చేశారు. పార్టీ ప్లీనరీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను పరిశీలించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.