గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి (Bandi Sanjay Kumar pays tribute to Atal Bihari Vajpayee)కి నివాళులర్పించారు. కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు.
సింగరేణి (Singareni Blast) లో జరిగిన ప్రమాదంపై కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో భారీ పేలుడు సంభవించి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోవడం తెలిసిందే.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో కరీంనగర్ కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే .. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో కోవిడ్ 19 విస్తృతి ఎక్కువగా ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎక్కడికక్కడ లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.