132 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన సోనియా గాంధీ 19 ఏళ్లపాటు నడిపించారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. శతాబ్ధంకుపైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రేపే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో అంతకన్నా ఒక రోజు ముందే ఆమె తన రిటైర్ మెంట్ ప్రకటించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంపై నీళ్లు చల్లారు అహ్మదాబాద్ పోలీసులు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ రోడ్ షో లకు అనుమతి లేదని చెప్పారు. గుజరాత్ లో రెండో దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరుఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. !
పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ ఉపసంహరణకు సోమవారమే చివరి రోజు. అయితే రాహుల్ మినహా మరెవరూ రంగంలో లేకపోవడంతో.. రాహుల్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించవచ్చు.
మంగళవారం నాడు రాబోయే గుజరాత్ ఎన్నికలను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేస్తూ.. మోదీని ప్రతీ రోజూ ఒక ప్రశ్న అడగాలని భావిస్తున్నానని.. వాటికి సమాధానం చెప్పాలని కోరారు.
భారత జాతీయ కాంగ్రెస్.. ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. డిసెంబర్ 28, 1885వ సంవత్సరంలో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 28, 2017న 133వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఆరోజున వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటోంది.
"ఒకవైపు బీజేపీ ఏమో రాహుల్‌ను హిందువు కాదు అంటోంది. మరో వైపు కాంగ్రెస్ ఏమో మోదీ హిందువు కాదు అంటోంది. అలాంటప్పుడు ఒక ముస్లిం అయిన నేను వారిని ఎందుకు ప్రశ్నించాలి?" అంటూ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ గుజరాత్ లో తొలిదశ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన నవంబర్ 24, 25 తేదీల్లో ఎన్నిక ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.