ట్విట్టర్ వేదికగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తిన చంద్రబాబు ట్వీట్ పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంపై జైట్లీ మాట్లాడుతూ సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. జైట్లీ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు బదులిస్తూ.. సెంటిమెంట్ ఆధారంగానే తెలంగాణ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు.
అనుకున్నట్లుగా బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను సమర్పించారు. విభజన హామీల విషయంలో కేంద్ర వైఖరికి నిరసిస్తూ మోడీ కేబినెట్ నుంచి వైదొలగాలని కేంద్ర మంత్రులు సుజనా చౌదరీ, అశోక్ గజపతి రాజులకు చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇలా టీడీపీ -బీజేపీ సంబంధాలు తెగిన నేపథ్యంలో బీజేపీ మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది.
రాష్ట్ర అసెంబ్లీ భవనం నమూనా తప్ప మిగితా నమూనాలన్నీ ఖరారయ్యాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విదేశీ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి సీఎం అమరావతికి వచ్చారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకొని, శనివారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బయల్దేరారు. ముఖ్యమంత్రి బృందం శనివారం నుంచి రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనుంది. భారత కాలగమనం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ బృందం దుబాయ్ చేరుకోనుంది. పర్యటనలో భాగంగా ముందుగా శనివారం దుబాయిలోని షేక్ రాషేద్ ఆడిటోరియంలో(భారతీయ పాఠశాల) లో ప్రవాసాంధ్రులతో భేటీకానున్నారు. ప్రవాసీ సంక్షేమ విధానంలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ కార్యక్రమాలను అమలును వెల్లడించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఆయన అక్టోబర్ 17 నుండి 26 వరకు యూఎస్, యూఏఈ, లండన్ లలో పర్యటించనున్నారు. చంద్రబాబు బృందం మొదట అమెరికాకు వెళ్తారు. అక్కడ అయోవా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమంలో పాల్గొంటారు. తరువాత మూడు రోజుల పర్యటనకుగానూ యూఏఈ వెళ్లనున్నారు. చివరగా లండన్ లో రాజధాని ఆకృతులపై నార్మన్, ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైతారు. అలానే గోల్డెన్ పీకాక్ అవార్డు బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమానికి హాజరవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.