దేశవ్యాప్తంగా కలకలం రేపిన స్వర్ణప్యాలేస్ అగ్ని ప్రమాదం ఘటనపై డాక్టర్ రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని సమాధానమివ్వడం చర్చనీయాంశమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు..న్యాయవ్యవస్థకు ప్రఛ్ఛన్నయుద్ధం ప్రకటితమైపోయిందా.. పరిస్థితులు అదే స్పష్టం చేస్తున్నాయా..అసలేం జరుగుతోంది.. చట్టాల్ని చేసే అత్యున్నత వేదిక సాక్షిగా పోరాటం ఉధృతం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ఇప్పుడు శాసనవ్యవస్థ వర్సెస్ న్యాయవ్యవస్థగా మారింది పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. పాలన చేస్తుంది ఎవరో తేల్చమన్న ఏజీ ప్రశ్నకు...హైకోర్టు స్పందించింది. తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ( YSRCP MLA Talari Venkat Rao ) కేసు నమోదైంది. ఆదిలక్ష్మి అనే మహిళ పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా ద్వారకాతిరుమల పోలీసులను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత కొద్దికాలంగా రాష్ట్ర హైకోర్టు నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాజ్యసభలో చర్చకొచ్చింది. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదంటూ రాజ్యసభలో ప్రస్తావించారు ఎంపీ విజయసాయి రెడ్డి.
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. రాజధాని ఒక్కటే ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని సాక్షాత్తూ హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను ఏపీకి తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మూడు రాజధానుల అంశాన్ని సుప్రీంకోర్టు ( Supreme court ) మరో బెంచ్ కు బదిలీ చేస్తూ విచారణ ప్రారంభించింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి వాదిస్తుండటంతో...కేసును మరో బెంచ్ కు బదిలీ చేశారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (AP Govt) హైకోర్టు ( High Court)నుంచి మరోసారి షాక్ తగిలింది. మూడు రాజధానులపై హైకోర్టు తాజాగా స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు.
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది.
వివాదాస్పదంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో ఆంధ్రప్రదేశ్ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసు విచారణకు సహకరించాలని సైతం డాక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) విషయంలో నిమ్మగడ్డ లాజిక్ మిస్ అయినట్టే కన్పిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ( AP AG Subrahmanya Sriram ) స్పష్టం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్‌కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందించారు.
ఏపీ హై కోర్టు ( AP High court ) రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( AP SEC Nimmagadda Ramesh Kumar ) ఆ స్థానం నుంచి తొలగించడంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ వివేకానంద కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.