వాషింగ్టన్ వేదికగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సదస్సు కోసం వాషింగ్టన్ వెళ్లిన జైట్లీ.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలపై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తాయంటూ జైట్లీ పేర్కొన్నారు.
మూడవ లైన్ ఆఫ్ క్రెడిట్లో భాగంగా బంగ్లాదేశ్, భారతదేశంతో 4.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సోషల్ సెక్టారు డెవలప్మెంట్లో భాగంగా జరిగిన ఈ ఒప్పంద పత్రాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిథి ఏ.ఎం.ఏ.ముహిత్ కూడా సంతకాలు చేశారు. అలాగే బంగ్లాదేశ్ తరఫున ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సెక్రటరీ ఖాజీ షౌఫికల్ ఆజామ్ సంతకం చేయగా, భారత్ తరఫున ఎక్స్‌పోర్టు ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరు డేవిడ్ రసిక్విన్హా సంతకాలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.