BBC Documentary: ప్రధాని మోదీ బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. డాక్యుమెంటరీపై నిషేధం విధించేందుకు నో చెబుతూ..పిటీషన్ను కొట్టివేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Suprem Court On BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది. డాక్యుమెంటరీని నిషేధించాలని న్యాయవాది కోరగా.. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారని కోర్టు బదులిచ్చింది.
BBC Documentary Screening in HCU: ఒకే భావజాలం కలిగిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) విద్యార్థి సంఘాలు బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలుసుకున్న యూనివర్శిటీ యాజమాన్యం.. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది.
Documentary Screening on PM Modi: యూనివర్శిటీ అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న ఈ డాక్యుమెంటరనీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనివర్శిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శన యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్ స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.