Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అటు కమలనాధులు కారు పార్టీ అధినేతపై వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది. తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.
తెలంగాణలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం దగ్గర సాలుదొర సెలవు దొర పేరుతో డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేశారు కమలనాధులు. పోస్టర్లు, ఫోటోలను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు, గతంలో చేసిన ప్రకటనలు పొందపరుస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూపంపిణి, అందరికి దళిత బంధు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను గుర్తు చేస్తూ.. హామీలు అమలు చేయని ‘సాలు దొర.. సెలవు దొర అంటూ బ్యానర్లు కట్టి బీజేపీ వైరల్ చేసింది. ఈ బోర్డులు బాగా వైరల్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా చర్చగా మారాయి.
బీజేపీ డిస్ ప్లే బోర్డుకు కౌంటర్ గా ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ కౌంటర్ బోర్డులు పెట్టింది. ప్రధానికి వ్యతిరేకంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది. తర్వాత పార్టీ కార్యాలయం దగ్గర పెట్టిన డిస్ ప్లే బోర్డును బీజేపీ తొలగించింది.అయితే సాలు దొర సెలవు దొర ప్రచారానికి అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది. బీజేపీ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. సొలు దొర సెలవు దొర క్యాంపెయిన్‌కు మీడియా సర్టిఫికేషన్ కమిటి అనుమతి నిరాకరించింది. సాలు దొర- సెలవు దొర అంటూ పోస్టర్లు ముద్రించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండ కూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.
Read also: MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. హత్యాయత్నంతో భద్రత పెంపు
Read also: YS Vijayamma: ఊపిరి పీల్చుకున్న సీఎం జగన్.. వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook