UP Election Result: ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టేందుకు అధికార బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కంటే మెరుగైన సీట్లు సాధించడం వల్ల కాషాయ వర్గాల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ ఎక్కువ స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోందీ కమలం పార్టీ. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా గోరఖ్‌పూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నారు. యూపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు.
UP election result 2022: యూపీలో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే.. బీజేపీ విజయం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సారి విజయంతో యోగీ ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించనున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
Raju Kohli Dressed Like CM Yogi Adityanath: నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి అందరిని ఆకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో పోలింగ్‌బూత్‌కు రావడంతో అందరూ సెల్పీలు దిగారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు పార్టీలు మారే ప్రక్రియ జోరుగా (Uttar Pradesh Assembly Election 2022) సాగుతోంది. అధికార బీజేపీని గద్దె దించాలని ఎస్పీ(సమాజ్‌వాదీ పార్టీ), బీఎస్పీలు (బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ కూడా మరోసారి ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారం చలాయించాలని ఎత్తుకు పై ఎత్తులు రచిస్తోంది.
Electricity charges in UP: యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Faizabad Junction New Name: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మారుస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మార్చడంపై చరిత్రకారులు, స్థానికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
Uttar Pradesh: వరకట్న వ్యవస్థని రూపుమాపేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. వివాహం సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో లఖింపూర్ ఖేర్ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకారులపైకి దూసుకెళ్లిన మంత్రి కొడుకు కాన్వాయ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలు ఎంత భయంకరంగా ఉన్నాయో మీరే చూడండి
Suspicious fever: ఓ వైపు ప్రపంచాన్ని కరోనా బెంబెలేత్తిస్తుంటే...మరోవైపు యూపీలో అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో 39మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 32 మంది చిన్నారుల ఉండటం విశేషం.
Beer gets cheaper in UP to boost beer sales: కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు విధించిన లాక్డౌన్ బీరు తాగే మందుబాబులపై కూడా బాగానే ప్రభావం చూపించినట్టుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో బీర్ సేల్స్ బాగా పడిపోయాయట. కాస్త అటుఇటుగా 36% బీరు విక్రయాలు (Beer sales) తగ్గాయన్నమాట.
Diwali bonus to govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) శుభవార్త చెప్పారు. అన్ని శాఖలు, విభాగాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14.82 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. దీపావళి బోనస్‌లో 75 శాతం మొత్తం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ( EPFO ) జమ కానుంది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో లవ్ జిహాద్ వంటి మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేపట్టింది. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టేందుకు కఠినమైన చట్టాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. సిట్ (SIT), సీబీఐ (CBI) కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్రాస్ బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు రక్షణగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కూడా అప్పగించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ ( Hathras incident) సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి అర్థరాత్రి బలవంతంగా దహనసంస్కారాలు (Hathras victims cremation ) నిర్వహించడంపై ప్రజలు, విపక్షాలు.. యూపీ పోలీసులు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ( UP Govt) అర్థరాత్రి దహన సంస్కారాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో సుప్రీంకోర్టు (Supreme Court ) కు వివరించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.