Electricity charges in UP: రైతులకు యోగీ సర్కార్​ గుడ్​ న్యూస్​- విద్యుత్ ఛార్జీలు 50% తగ్గింపు!

Electricity charges in UP: యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 01:20 PM IST
  • రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పిన యూపీ ప్రభుత్వం
  • విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గిస్తూ ప్రకటన
  • ఎన్నికల నేపథ్యంలోన యోగీ సర్కార్​ నిర్ణయం
Electricity charges in UP: రైతులకు యోగీ సర్కార్​ గుడ్​ న్యూస్​- విద్యుత్ ఛార్జీలు 50% తగ్గింపు!

Electricity charges in UP: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతులపై వరాల జల్లు కురిపించింది ఉత్తర్ ప్రదేశ్​ ప్రభుత్వం. రైతులకు విద్యుత్ బిల్లులను 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం (Electricity charges cut 50 pc in UP) వెల్లడించింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో (UP Elections 2022) వివిధ రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్​ ప్రకటన చేయగా.. అధికార బీజేపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్​ ఖాతా ద్వారా (UP Govt on Electricity charges) వెల్లడించింది.

కాగా నిర్ణయంతో మీటర్​ కనెక్షన్​ ఉన్నపై యూనిట్​ విద్యుత్​కు ఒక రూపాయి ఛార్జీ ( New Electricity charges in UP) చేయనున్నారు. ఇంతకు ముందు ఇది రూ.2గా ఉంది.

ఒక హార్స్​ పవర్​ మీటర్​పై ఛార్జీని రూ.70 నుంచి రూ.35కు (Good news for Farmers) తగ్గించనున్నారు.

మీటర్​ లేని కనెక్షన్​కు ఒక హార్స్​ పవర్​కు రూ.85 ఛార్జీ విధించనుంది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇది రూ.170గా ఉంది.

ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి మీటర్​ కనెక్షన్​పై యూనిట్​ విద్యుత్​కు రూ.3 చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నరు. ప్రస్తుతం ఇది రూ.6గా ఉంది. ఫిక్స్​డ్​ మీటర్ ఛార్జీ రూ.130 నుంచి రూ.65కు తగ్గనుంది.

ఇతర పార్టీల హామీలు ఇలా..

ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలు విద్యుత్ ఛార్జీలపై హామీలు ఇచ్చాయి. రైతులు 300 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని సమాజ్​వాది (SP on Electricity Charges in UP) పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు హామీలు (AAP on Electricity Charges in UP) ఇచ్చాయి.

Also read: Ayodhya Earthquake: అయోధ్య సమీపంలో భూకంపం.. భయాందోళనల్లో ప్రజలు!!

Also read: Omicron Death: ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. కొత్త వేరియంట్‌తో దేశంలో రెండో మరణం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News