CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
Andhra Pradesh Politics: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో హెలిప్యాడ్ ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ ల్యాండింగ్ అవుతున్న నేపథ్యంలో గాల్లోకి ఒక్కసారిగా చీపురు పైకి లేచింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
YSRCP Election Campaign: ఏపీలో మరో 70 ఎన్నికలు రానున్నాయని.. వైసీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
CM Jagan Review Meeting: ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం జగన్. ప్రభుత్వం అన్ని రకాలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
CM Jagan Review Meeting on Cyclone Michaung: మిచౌంగ్ తుపాను ప్రభావంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటుందన్నారు.
CM Jagan Review Meeting On Cyclone Michoung: మిచౌంగ్ తుఫాను ఏపీ వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు.
CM Jagan Meet With Union Ministers: ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర సమస్యలు వివరిస్తూ.. రావాల్సి నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడప గడప నుంచి ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చక్కదిద్దిన భారతి.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
CM Jagan Inspects Polavaram Project Works: డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
CM Jagan Mohan Reddy Distributes Tractors: గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించారు సీఎం జగన్. రైతులు వైఎస్సార్ యంత్ర సేవ యాప్ ద్వారా 15 రోజులు ముందుగా బుక్ చేసుకోవాలని చెప్పారు.
Group-1 and Group-2 Posts In AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. అతి త్వరలో గ్రూప్-1, 2 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సీఎం జగన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
CM YS Jagan Mohan Reddy: కళ్యాణ్ మస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. 12,132 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలుచేశామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆ ధైర్యంతోనే గడపగడపకూ వెళ్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
YS Jagan launched YSR EBC Nestham : వైఎస్సార్ ఈబీసీ నేస్తం ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాల్లో లేకున్నా అమలు చేస్తున్నామన్న వైఎస్ జగన్. పేద వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే తాము ముందుకెళ్తున్నామన్నారు జగన్.
Chiranjeevit to meet CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి గురువారం (జనవరి 13) మధ్యాహ్నం భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు చిరంజీవికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాయి. సీఎం, చిరంజీవి కలిసి లంచ్ చేయనున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో కీలకంగా మారిన వాచ్మెన్ రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. నార్కో పరీక్షల కోసం రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారు. రెండు రోజుల నుంచి రంగయ్యను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నప్పటికీ.. అతడు సరైన సమాధానం చెప్పలేదని భావిస్తున్న అధికారులు కోర్టు అనుమతితో అతడిని నార్కో పరీక్షలకు తరలించారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.