Hardik Pandya Ruled Out Of World Cup 2023: బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా.. వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి కోలుకునే అవకాశాలు లేకపోవడంతో పాండ్యా స్థానంలో ప్రసిద్ద్ కృష్టను జట్టులోకి తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
Mohammed Shami World Cup Wickets: మహ్మద్ షమీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్స్‌లో టీమిండియా తరుఫులన అత్యధిక వికెట్లు (45) తీసిన బౌలర్‌గా నిలిచాడు. జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ (44) రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీశాడు.
India Vs Sri Lanka World Cup 2023 Highlights: వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియాలో ప్రవేశించింది. గురువారం శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. షమీ, సిరాజ్ లంకేయులకు చుక్కలు చూపించారు.
Pakistan vs Bangladesh Full Highlights: పాకిస్థాన్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. బంగ్లాదేశ్‌ను 7 వికెట్లతో ఓడించి.. వరుస నాలుగు ఓటములతో తరువాత గెలుపు రుచి చూసింది. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Babar Azam Private Chat Leaked: వరల్డ్‌కప్‌లో వరుస ఓటములతో డీలా పడిపోయిన పాక్ జట్టుకు మరో సమస్య వచ్చిపడింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. దీంతో క్రికెట్ వర్గాల్లో గోప్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
India Vs England World Cup 2023 Highlights: ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. వరుసగా ఆరో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో మట్టికరిపించి.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
Ind Vs Eng World Cup 2023 Updates: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీని ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్ వేసింది. డేవిడ్ విల్లీ లైన్ అండ్ లెంగ్త్‌తో ఒకే తరహా బంతులు వేసి కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించి కోహ్లీ ఈజీగా క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
India Vs England World Cup 2023 Updates Toss and Playing 11: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
Netherlands vs Bangladesh World Cup 2023: బంగ్లాదేశ్‌పై 87 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది నెదర్లాండ్స్. బ్యాటింగ్‌లో స్వల్ప స్కోరే చేసినా.. నెదర్లాండ్స్ బౌలర్లు చక్కగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టారు.
Australia vs New Zealand World Cup 2023: ఆసీస్-కివీస్ జట్ల మధ్య జరిగిన బిగ్‌ఫైట్‌లో కంగారులదే పై చేయి అయింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్‌కు వరుసగా నాలుగో విజయం కాగా.. న్యూజిలాండ్‌కు వరల్డ్ కప్‌లో రెండో ఓటమి.
South Africa Beat Pakistan By 1 Wicket: పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 270 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. మరో వికెట్ చేతిలో ఉండగా సఫారీ లక్ష్యాన్ని ఛేదించింది.
India Vs New Zealand Highlights: ధర్మశాల ఔట్‌ఫీల్డ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని ఆపబోయి ఔట్‌ఫీల్డ్ కారణంగా కిందపడ్డాడు. దీంతో రెండు ఓవర్లపాటు అసహనం వ్యక్తం చేశాడు.
India Vs New Nealand Playing11 and Dream11 Team: న్యూజిలాండ్‌తో నేడు టీమిండియా తలపడనుంది. రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్-2 లో ఉన్నాయి. ఆదివారం ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
India vs New Zealand World Cup 2023: న్యూజిలాండ్‌తో పోరుకు ముందు భారత ఆటగాళ్ల గాయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే హర్థిక్ పాండ్యా ఔట్ అవ్వగా.. తాజాగా ఇషాన్ కిషన్‌పై తేనెటీగ దాడి చేసింది. సూర్యకుమార్ యాదవ్ మణికట్టు గాయంతో ఇబ్బంది పడ్డాడు.
Ind Vs Ban Highlights: ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. అన్ని రంగాల్లో రాణించిన భారత్.. బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బౌండరీ బాదగా.. సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్ హైలెట్‌గా నిలిచింది.
IND vs BAN World Cup 2023 Updates: ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగాడు. బౌలింగ్ చేసే సమయంలో బంతి కాలితో ఆడ్డుకునేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దీంతో చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్‌కు దిగడం అనుమానంగా మారింది.
IND vs BAN 1st Innings Updates: బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బంగ్లాదేశ్‌ను టీమిండియా బౌలర్లు మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 257 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
India vs Bangladesh World Cup 2023 Updates Toss and Playing 11: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్ దూరమయ్యాడు. నజ్మూల్ శాంటో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
India Vs Bangladesh Playing11 and Dream11 Team Tips: నేడు బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్లలో ఎవరు ఉంటారు..? ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉంది..? పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా తీసుకోవాలి..? వంటి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.