Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే నవంబర్ 23 నుంచి ధరణి పోర్టల్‌పై వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభించడానికి అధికార యంత్రాంగం కూడా డిజిటలైజేషన్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది.
రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana CM KCR launches Dharani Portal | రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో నేటి మధ్యాహ్నాం 12:30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి ( Telangana new revenue act 2020 bill ) శాసనసభ ఆమోదం తెలిపింది. సభలో మూజువాణి ఓటింగ్ ద్వారా బిల్లుకు సభ్యుల నుంచి ఆమోదం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.