అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 'నమస్తే ట్రంప్' వేదికపైకి స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ స్పీచ్ ఇచ్చారు. అంతకంటే ముందుగా నమస్తే ఈవెంట్‌కి హాజరైన వారిని ఉద్దేశించి 10 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్ ఉపన్యాసం తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ప్రసంగిస్తానని అన్నారు.
వీడియో: ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమైన ప్రధాని మోదీ- డొనాల్డ్ ట్రంప్ రోడ్ షో, ప్రధాని నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ షో ప్రారంభమైంది.
అహ్మెదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అహ్మెదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకుని మిత్రుడికి సాదర స్వాగతం పలికారు. ట్రంప్ సతీమణి మెళానియా ట్రంప్‌కు చేయి చాయి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత గడ్డపైకి స్వాగతించారు. అనంతరం విమానాశ్రయంలో ఆయన రాకకోసం వేచిచూస్తున్న భారత ప్రతినిధుల బృందాన్ని ప్రధాని మోదీ ఆయనకు పరిచయం చేస్తూ వెళ్లారు. అక్కడి నుంచి ట్రంప్ తన బీస్ట్ కారు ఎక్కి కూర్చోగా.. ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో రోడ్ షోగా బయల్దేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితమే అహ్మెదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్, ఎక్స్‌క్లూజీవ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి జీ హిందుస్తాన్ తెలుగు వెబ్సైట్.
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఫిబ్రవరి 24, 25 తేదీలలో రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్ లో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మెదాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మెదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి 22 కి.మీ మేర రోడ్ షో చేపట్టాల్సి ఉండగా.. తాజాగా ఆ రోడ్ షోను 9 కిమీ కుదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ..డ్రీమ్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం 'ది స్టాచ్యూ ఆఫ్ యునిటీ'ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మరో డ్రీమ్ ప్రాజెక్టు రెడీ అయింది.
మీ ఊళ్లో .. ఎమ్మెల్యే వచ్చినప్పుడు .. లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు .. అధికారులు ఏం చేస్తారో గుర్తుందా.. ? అవును .. మీరు ఊహించింది కరెక్టే. ప్రజాప్రతినిధి వస్తున్నప్పుడు దోమలు రాకుండా పౌడర్ చల్లుతారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్ అధికారులు అదే చేస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రంప్ చేష్టల కారణంగా .. ఆయన్ను బహిరంగంగానే ద్వేషించే చాలా మందిని మనం చూశాం. కానీ ఆయనకు వీరాభిమానులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం నుంచి విజయవంతంగా గట్టెక్కారు. ఇప్పటివరకూ అమెరికాలో అభిశంసన ద్వారా ఏ అధ్యక్షుడు పదవీచ్యుతుడు కాకపోవడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో తొలిసారి పర్యటించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో అధికారులు త్వరలో షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.