Huzurabad bypoll updates: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు తేదీ సమీపించిన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య..ఈ ఉప ఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై తన వైఖరిని స్పష్టంచేశారు.
Huzurabad bypoll Withdrawal of nominations: హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు ఉన్నారు. నేటి వరకునామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో ఈ రోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు.
FIR filed against Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి నుంచి ఈటల రాజేందర్ (Eetela Rajender) పోటీ చేస్తుండగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav), కాంగ్రెస్ పార్టీ తరపున నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం నాయకుడు బల్మూరి వెంకట్ (Balmoori Venkat) బరిలోకి దిగుతున్నారు.
Huzurabad bypolls nominations last date: హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అధికార పార్టీని గెలిపించాల్సిందిగా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హుజురాబాద్ ఉప ఎన్నికల క్షేత్రంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ని (Etela Rajender) గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీజేపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
Huzurabad bypolls latest updates: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు ఘెల్లు శ్రీనివాస్ యాదవ్ (Ghellu Srinivas Yadav) పోటీ చేస్తుండగా బీజేపి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) బరిలో నిలబడ్డారు.
Dalita Bandhu scheme review meeting: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ఎలాగైతే ఉద్యమం కొనసాగించామో.. అలాగే చివరి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం లబ్ధి (Dalita Bandhu Scheme beneficiaries) చేకూరే వరకు దళిత బంధు పథకం కూడా ఒక ఉద్యమం తరహాలోనే కొనసాగుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
Etela Rajender demands dalita bandhu scheme for all Dalits in Telangana : హుజురాబాద్: దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలు అన్నింటికీ తక్షణమే దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
Minister Harish Rao comments on Etela Rajender: హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) ఈటల రాజేందర్ గెలుస్తే.. ఒక్క వ్యక్తిగా ఆయన మాత్రమే గెలుస్తాడు. మీరంతా ప్రజలుగా గెలుస్తారా ? లేక ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కేవలం ఒక వ్యక్తిగా గెలిపిస్తారా అనేది మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
ఈటెలకు దీటుగా, తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ బుధవారం రోజున ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు అటు బీజేపీ పార్టీకి, ఇటు టీఆర్ఎస్ ముఖ్యం అవగా, యావత్ రాష్ట్రం ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుంది.
Etela Rajender's health condition:హైదరాబాద్: పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన మోకాలికి ఆపరేషన్ (Etela Rajender's knee surgery) చేయాలని సూచించారు.
Etela Rajender health condition: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజా దీవెన యాత్ర చేస్తోన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలోనే ఈటల రాజేందర్ స్వల్ప అనారోగ్యం బారినపడ్డారు.
Motkupalli Narsimhulu praises CM KCR and Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. ఒక దళిత కుటుంబానికి రూ 10 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు దేశంలోనే లేడని మోత్కుపల్లి నర్సింహులు కితాబిచ్చారు.
Inugala Peddi Reddy resigned to BJP: హుజూరాబాద్: హుజురాబాద్‌లో బీజేపీ నేత ఇనుగాల పెద్ది రెడ్డి రూపంలో ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి... ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
CM KCR phone call audio leaked: హైదరాబాద్: ఈటల రాజేందర్ చాలా చిన్నోడు. ఈటల రాజేందర్‌తో వచ్చేది లేదు సచ్చేది లేదు. ఈటల రాజేందర్ గురించి మాట్లాడటం చిన్న విషయం. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ నిరోషా భర్త రామస్వామితో ఫోన్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి (CM KCR comments on Etela Rajender).
Motkupalli Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదన్న మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్ లాంటి అవినీతిపరుడిని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తంచేశారు.
Kaushik Reddy joins TRS ahead of Huzurabad bypolls: కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీపీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితమే తన అనుచరులు, ఇతర స్థానిక నేతలతో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
KTR Criticise BJP Leader Etela Rajender: ఒకవేళ గతంలోనే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే, ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిలో ఎలా కొనసాగారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay Kumar Delhi Tour: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన అనంతరం హుజురాబాద్‌లో రాజకీయాలు మారుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం హుజురాబాద్ నుంచే తమ విజయం మొదలుపెట్టాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
Kaushik Reddy audio tapes, Kaushik Reddy to join TRS: హైదరాబాద్: హుజూరాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తారంటూ టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి ఓ యువకుడితో ఫోన్లో జరిపిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ టీపీసీసీకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.