Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ ట్రెండింగ్ అవుతున్న పేరు. వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. తాజాగా ఈమె 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
Sreeleela: శ్రీలీల తెలుగులో కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో పరిచయమైంది. తొలి సినిమాతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగులో క్రేజీ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ రియల్ బిజినెస్ మేన్ అని చెప్పాలి. తెలుగులో ఈయన చేతిలో ఉన్నన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఏ హీరో చేతిలో లేవు. తాజాగా ఫోన్ పే లో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తోంది. ఈ యాడ్ కోసం సూపర్ స్టార్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో కాకుండా ఆ భాషలో ట్రెండ్ కావడం విశేషం.
Mahesh Babu - Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనలో ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా డివైడ్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ పై ముందుగా నెగిటివ్ కామెంట్స్ వినిపించగా.. ఇందులో ఈ పాటనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలోని స్టెప్పులను ఇపుడు విదేశీయులు సైతం వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
Mahesh Babu Recent Movies Collections: ఇపుడున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఇంకా ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇపుడు చేయబోయే రాజమౌళి సినిమాతో ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్‌లో సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. మహేష్ బాబు హీరోగా నటించి 'గుంటూరు కారం' సహా లాస్ట్ ఐదు చిత్రాల బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు షేర్ రాబట్టిందో మీరు ఓ లుక్ వేయండి..
Mahesh Babu - Guntur Kaaram WW Closing Collections: సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాల్లో హనుమాన్ మాత్రమే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతూ ఉంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాల థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది.
Mahesh Babu : మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' మూవీ కథ తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టు కెక్కి విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచిన మరో సినిమా కథ కూడా తనదే అంటూ అదే వ్యక్తి కోర్టు కెక్కబోతున్నాడు.
Mahesh Babu - Guntur Kaaram OTT News: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషనలో ఈ సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్లో సాలిడ్ వసూళ్లనే రాబట్టింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Mahesh babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్‌తో ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చిన ఈ సినిమా నుంచి ఒక్కో ఫుల్ వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ కోవలో మరో మాస్ పాటను విడుదల చేసారు మేకర్స్.
Rajamouli - Mahesh Babu: రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో పోకిరి తరహా వింటేజ్ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు మహేష్ బాబు. ఇక త్వరలో పట్టాలెక్కనున్న రాజమౌళి కొత్త లుక్‌లో కనిపించబోతన్నాడు. ఆ లుక్ ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Guntur Kaaram OTT Date: సంక్రాంతి పండుగకు విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం. ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమైపోయింది.
Mahesh Babu - Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనలో ఈ సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికే విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసారు. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Pawan Kalyan - Trivikram: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌కు సెపరేట్ ప్లేస్ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ల కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమా సూపర్ స్టార్ అభిమనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్‌గా ట్రెయిన్ అవుతున్నాడు.
Mahesh Babu Sankranthi Releases: సంక్రాంతి పండుగ అంటేనే సినిమాలకు పెద్ద పండుగ తో సమానం. సంక్రాంతి వస్తుంది అంటే థియేటర్లలో సినిమాల హడావిడి కామన్. అయితే ఒక స్టార్ హీరోకి మాత్రం సంక్రాంతి తెగ కలిసి వచ్చింది అనడంలో ఎటువంటి డౌటు లేదు. మామూలు రోజుల్లో విడుదల అయితే బోల్తా కొట్టే సినిమాలు కూడా సంక్రాంతి పుణ్యమా అని ఆ స్టార్ హీరోకి బాక్సాఫీస్ బంపర్ హిట్లుగా నిలిచాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ మూవీస్ ఏమిటి తెలుసుకుందామా..
Mahesh Babu@25 Years : హీరోగా మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 1999లో హీరోగా నట ప్రస్థానం ప్రారంభించిన మహేష్ బాబు.. ఈ యేడాది హీరోగా సిల్వర్ జూబ్లీ (25 Years)లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలకు రెడీ అవుతున్నారు.
Guntur Kaaram: సంక్రాంతి సీజన్లో భారీ అంచనాలతో విడుదలైంది మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల గుంటూరు కారం. ఈ మూవీకి విడుదలకు ఒక రోజు ముందు ఫ్యాన్స్ కోసం ప్రీమియర్స్ వేసారు. అక్కడ నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ ప్రారంభమైంది. అది ఈ మూవీ కలెక్షన్స్ పై పడింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడానికి మరో పెద్ద రీజనే ఉంది.
Guntur Kaaram 1st week box office collections: సంక్రాంతి సీజన్లో అందరి కళ్లు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల గుంటూరు కారంపైనే ఉంది. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తో ప్రారంభమైన ఈ మూవీ నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకుంది. అంతేకాదు డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లను రాబట్టింది.
Guntur Kaaram Collections: సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం. మొదటి షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు.. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.