Guntur Kaaram: సంక్రాంతి వల్ల గట్టెక్కిన మహేష్ బాబు సినిమాలు.. ఏకంగా మూడు !

Mahesh Babu Sankranthi Releases: సంక్రాంతి పండుగ అంటేనే సినిమాలకు పెద్ద పండుగ తో సమానం. సంక్రాంతి వస్తుంది అంటే థియేటర్లలో సినిమాల హడావిడి కామన్. అయితే ఒక స్టార్ హీరోకి మాత్రం సంక్రాంతి తెగ కలిసి వచ్చింది అనడంలో ఎటువంటి డౌటు లేదు. మామూలు రోజుల్లో విడుదల అయితే బోల్తా కొట్టే సినిమాలు కూడా సంక్రాంతి పుణ్యమా అని ఆ స్టార్ హీరోకి బాక్సాఫీస్ బంపర్ హిట్లుగా నిలిచాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ మూవీస్ ఏమిటి తెలుసుకుందామా..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 11:53 AM IST
Guntur Kaaram: సంక్రాంతి వల్ల గట్టెక్కిన మహేష్ బాబు సినిమాలు.. ఏకంగా మూడు !

Guntur Kaaram: సంక్రాంతి అంటే సిని లవర్ల పండుగ. ఈ సీజన్ లో థియేటర్లలో సినిమాలు విడుదల జోరుతో పాటు.. కలెక్షన్ల హోరు కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగు ప్రజలు భోగి, సంక్రాంతి ,కనుమ పండుగలను  కుటుంబంతో కలిసి థియేటర్లలో సినిమా చూసి జరుపుకోవడం సంప్రదాయంగా మార్చేసుకున్నారు. అందుకే సంక్రాంతి సినిమాల కలెక్షన్ ఎప్పుడూ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ఈ పాయింట్ ని బాగా యూజ్ చేసుకున్న హీరో మరెవరో కాదు స్టార్ హీరో మహేష్ బాబు. మహేష్ బాబు లేటెస్ట్ గుంటూరు కారం దగ్గర నుంచి ..బిజినెస్ మాన్ వరకు సంక్రాంతి పుణ్యమా అని గట్టెక్కిన చిత్రాలు ఏవో మీకు తెలుసా?

గుంటూరు కారం

మహేష్ బాబు రీసెంట్ గా సంక్రాంతి బరిలోకి దిగిన చిత్రం గుంటూరు కారం. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఓ మోస్తారు స్పందన అందుకుంది. నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చేయాల్సిన మూవీ కాదు అని గుంటూరు కారం చూశాక ఎందరో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూవీ పరిస్థితి అంతే అనుకునే సమయానికి ఫ్యామిలీ ఆడియన్స్ మేమున్నాము అంటూ ముందుకు రావడంతో సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలబడగలిగింది. సంక్రాంతి సీజన్ కాకుండా మామూలు టైం లో ఈ చిత్రం వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉండేవి కాదు.

సరిలేరు నీకెవ్వరు:

అనిల్ రావిపూడి.. మహేష్ కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో మహేష్ బాబు ఓ మిలిటరీ ఆఫీసర్ గెటప్ లో అందరిని ఆకట్టుకున్నాడు. అయితే అవసరానికి మించిన కామెడీ.. ఓవర్ ఎలివేషన్స్.. ఇలా స్టోరీలో చాలానే లాగింగ్ ఉంది. సంక్రాంతి టైం లో రావడం.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ కావడం.. ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది.

బిజినెస్ మెన్:

2012లో మహేష్ బాబు నటించిన చిత్రం బిజినెస్ మాన్. పూరి జగన్నాథ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ నెలకొన్నాయి. మరి ముఖ్యంగా పోకిరి సక్సెస్ తరువాత మహేష్ బాబు నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఒక్క ఆట ఆడేస్తుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి రోజే ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయితే సంక్రాంతి సీజన్ కావడం ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. అందుకే మిశ్రమ స్పందనతో కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల కలెక్షన్ సాధించింది.

Also read: Indian Railway New Rules: రైళ్లో లోయర్ బెర్త్ కొత్త రూల్స్, ఇక ఆ సీటు వారిదే

Also read ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News