Dera Chief Gurmeet Ram Rahim: డేరా బాబా(dera baba) అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఓ హత్య కేసులో జీవిత ఖైదు విదిస్తూ..తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
డేరా సచ్ఛా సౌదా అధిపతి మరియు ఒక నెల క్రితం సాధ్వీల అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్షను పొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై మరో పిటీషన్ కోర్టులో దాఖలైంది. డేరాబాబాకి జీవిత ఖైదు విధించాల్సిందేనని ఆ పిటీషనులో సాధ్వీలు పేర్కొన్నారని సమాచారం. ఇద్దరు సాధ్వీలపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడాడని ఏప్రిల్ 2002లో డేరాబాబాపై నమోదైన కేసులో, అనేక సంవత్సరాల విచారణ అనంతరం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక నెల క్రితమే అతనికి శిక్షను ఖరారు చేశారు. ఈ క్రమంలో మరో పిటీషను దాఖలు కావడం ఆసక్తికరమైన చర్చగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.