Himachal cm candidate: గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించినా.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. దీంతో తదుపరి సీఎం ఎవరనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పీఠం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశా కుమారి సిమ్లాలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ రివ్యూ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. భద్రత నియమాల ప్రకారం తనను ఆపిన మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహంతో చేయి చేసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అనట్లుగా మారిపోయింది. కౌటింగ్ ప్రారంభమైన తొలి గంటలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. అయితే తర్వాతి క్షణం నుంచి కాంగ్రెస్ ఊపందుకుంది. ఆధిక్యాన్ని 10 నుంచి 21కి ఎగబాగికింది. ప్రస్తుతం బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది
గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాగా ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన గంటా.. రెండు గంటల్లోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిందీ తెలిసిపోతుంది.కాగా హిమాచల్ ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.