BRS Party MLAs Touch: తెలంగాణలో జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునేందుకు రెండు పార్టీలు చూస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Karimnagar MP Seat: కరీంనగర్ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్‌ను విమర్శించారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
MP Bandi Sanjay Comments: తనకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. తనను, రాజాసింగ్ లాంటి వాళ్లను గెలిపించకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడే వారుండని అన్నారు.
Karimnagar Assembly Constituency: తాను ఎంపీగా కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని.. ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. రెండుసార్లు ఓడిపోయానని.. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలన్నారు.
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రలోభాలకు గురవ్వకుండా వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కరీంనగర్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేటీఆర్ పేర్కొన్నారు.
Nia Searches In Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు చేసింది..తెల్లవారు జామునుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నిషేధిత PFI ఇంచార్జ్‌గా పనిచేసిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా మంటలు చల్లారడం లేదు. అన్ని వైపులా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Man Died of Heart Attack Due to Ambulance stuck at Railway Gate: గుండె నొప్పితో బాధపడుతున్న పేషెంట్ ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకుంటుంది అనగా మార్గం మధ్యలో రైల్వే గేటు పడింది. దీంతో హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్ అక్కడే చిక్కుకుపోయింది. చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నప్పటికీ.. రైల్వే గేట్ పడటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. పూర్తి వివరాలు...
Ekta Yatra in Karimnagar: రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ అంతటా హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తానని చెప్పారు.
Bandi Sanjay Comments on Ektha Yatra: ఆదివారం నాడు కరీంనగర్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించిన బండి సంజయ్ రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకు పాటు పడదామని అన్నారు.
Suspended Jagtial Rural SI Anil Kumar: బస్సులో సీటు విషయమై ముస్లిం మహిళతో వివాదం నేపథ్యంలో సస్పెండ్ అయిన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలలో స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదని అనిల్ కుమార్ తేల్చి చెప్పారు
Suspended Jagtial SI Anil Kumar Issue: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్ తోపాటు ‘‘కేరళ స్టోరీ’’ సినిమా యూనిట్ హిందూ ఏక్తా యాత్రకు రాబోతోందని చెప్పారు.
Suspended Jagtial SI Anil Kumar: జగిత్యాల రూరల్ ఎస్ఐ అనీల్ యాదవ్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొల్ల కురుమ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణలో గొల్ల కురుమల సమావేశం అనంతరం ప్రకటన విడుదల చేశారు.
Gangula Kamalakar Stage Collapsed: కరీంనగర్ జిల్లా కారేపల్లి మండలం చెర్లబూట్కూర్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని ప్రమాదంతో ఆత్మీయ సమ్మేళనం కాస్తా అయోమయంగా మారింది. ఒక్కక్షణం ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో నేతలు, కార్యకర్తలు, సభకు హాజరైన జనం పెద్ద పెట్టున అరవడం మొదలుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.