Gangula Kamalakar Stage Collapsed: మంత్రి గంగుల కమలాకర్‌కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లోని చెర్లబూట్కూర్‌లో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగుల కమలాకర్ వేదికపై ఉండగానే స్టేజీ కుప్పకూలింది. పరిమితికి మించి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్టేజీపైకి ఎక్కడంతో స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో సభావేదికపై ఉన్న మంత్రి గంగుల కమలాకర్ సహా నేతలు, కార్యకర్తలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కమలాకర్‌కు గాయాలయ్యాయి. స్థానిక జడ్పీటీసీ సభ్యుడి కాలు విరిగింది.
స్టేజీ కుప్పకూలిన సమయంలో అక్కడే ఉన్న మంత్రి భద్రతా సిబ్బంది, పోలీసులు మంత్రి గంగుల కమలాకర్ సహా గాయపడిన జడ్పీటీసీ సభ్యుడిని ఆస్పత్రికి తరలించారు. మంత్రి గంగులకు ఎడమ పాదం బెనికినట్టు తెలుస్తోంది. కాలు విరిగిన జడ్పీటీసీ సభ్యుడికి చికిత్స అందిస్తున్నారు.
చెర్లబూట్కూర్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని ప్రమాదంతో ఆత్మీయ సమ్మేళనం కాస్తా అయోమయంగా మారింది. ఒక్కక్షణం ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో నేతలు, కార్యకర్తలు, సభకు హాజరైన జనం పెద్ద పెట్టున అరవడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన స్థానిక బీఆర్ఎస్ నేతలు జనాన్ని కంట్రోల్ చేస్తూ భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదని.. స్టేజీ కుప్పకూలడం వల్లే ఈ గందరగోళం నెలకొందని చెప్పడంతో అందరూ స్థిమితపడ్డారు.
నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో సిలిండర్ పేలుడు ఘటనలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో చీమలపాడు దుర్ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ ఘటనలో గాయపడిన వారు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి : Fire Accident: హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారి సహా దంపతుల సజీవ దహనం..
చీమలపాడు ఆత్మీయ సమ్మేళనం దుర్ఘటనలో మరో విషాదం ఏంటంటే.. ఆరోజు ప్రమాదం కారణంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో అప్పటికే సభకు హాజరైన నేతలు, కార్యకర్తలు, జనం బోజనాలు చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో అప్పటికే చేసిన వంటలను సభా వేదిక సమీపంలోనే వృథాగా కిందపోయడంతో అవి తిన్న పశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అందులో అజ్మీర రవి అనే రైతుకు చెందిన ఆవు చనిపోగా.. మరో నాలుగు పశువుల పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం పశువైద్యులు ఆ నాలుగు పశువులకు చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Khammam Fire Accident: BRS ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK