Sanjay Vs KTR: పాత సామానోళ్లు కూడా 'కారు'ను కొనరు: కేటీఆర్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్‌

Karimnagar MP Seat: కరీంనగర్‌ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఘాటుగా స్పందించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్‌ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్‌ను విమర్శించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2024, 08:53 PM IST
Sanjay Vs KTR: పాత సామానోళ్లు కూడా 'కారు'ను కొనరు: కేటీఆర్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్‌

Sanjay fire on KTR: 'హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్‌కు రాజకీయలెందుకు? మఠం పెట్టుకుంటే చాలు' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్‌ బదులిస్తూ.. కేటీఆర్‌ తీరును తప్పుబట్టారు. కేసీఆర్‌కు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? అని ప్రశ్నించారు. నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా? అని సంజయ్‌ బదులిచ్చారు. కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని విమర్శించారు.

కరీంనగర్‌ జిల్లా ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న ఆర్వోబీ పనులను ఆదివారం సంజయ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా సంజయ్‌ పై విధంగా సమాధానమిచ్చారు. 'రాష్ట్రంలో 99 శాతం మంది దేవుడిని నమ్మేవాళ్లు ఉన్నారు. నేనడుగుతున్న. కేటీఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడ దేవుడిని నమ్మేవాళ్లు నాస్తికుడి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి' అని సవాల్‌ విసిరారు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్ అని మండిపడ్డారు. ఇకనైనా తెలంగాణకు పట్టిన దరిద్, మీ అరాచకాలు, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీయే అని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీపై సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'కారు సర్వీసింగ్‌కు పోయిందట. కారు షెడ్డుకు పోయింది. రిపేర్‌కు కూడా పనికిరాకుండా పోయింది. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదు' అని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని సవాల్‌ విసిరారు. రాబోయే ఎన్నికల్లో మోదీ చేసిన అభివృద్ధి, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెబుతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ది మూడో స్థానమే రాసి పెట్టుకోండి అని చెప్పారు. 

కరీంనగర్‌ ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్న బోయనపల్లి వినోద్‌ కుమార్‌పై సంజయ్‌ విమర్శించారు. వినోద్ కుమార్ నాన్ లోకల్ అని చెప్పారు. గతంలో ఎంపీగా గెలిచిన ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఏనాడూ ప్రజలను కలవలేదని, అలాంటి వ్యక్తి ఎన్నికలొస్తుండడంతో మళ్లీ డ్రామాలాడుతున్నాడని తెలిపారు. వినోద్‌ మాటలను ఎవరూ పట్టించుకోరు అని కొట్టిపారేశారు.
 

Also Read: AP High Court Junior Civil Judge: ఏపీ పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతికి ఫస్ట్‌ ర్యాంక్‌.. అలేఖ్య అరుదైన ఘనత

Also Read: Seethakka: కేటీఆర్‌ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలా? మంత్రి సీతక్క విస్మయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News