Komati Reddy Brothers - Uttam Kumar Reddy: గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. పదవుల కోసం కుటుంబాల్లో కోల్డ్ వార్ జరుగుతున్నాయి. ఇంతకీ ఏ కుటుంబంలో ఈ వార్ నడుస్తుందో.. మంత్రి పదవి లభిస్తుందో లేదో తెలుసుకోండి.
Addanki Dayakar About Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు బిగ్ బ్రదర్ లాంటి వారు అని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. మునుగోడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన్ని అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్.. ఇప్పుడిలా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా ?
Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన కోమటిరెడ్డి ఆ విషయాలను తెలిపారు.
Dasoju Sravan: ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లికి లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం ఖాయమైంది.
Revanth Reddy: తాను పీసీసీ చీఫ్ అయ్యాకే జరిగిన హుజురుబాద్ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడుపై మాత్రం దూకుడుగా వెళుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడుకు వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. మునుగోడు గడ్డ నుంచే గర్జించారు
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది.
Telangana Politics: ఢిల్లీలో సోమవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశం కాబోతున్నారు. ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్టీ చేరికల కమిటీ చైర్మెన్, సీనియర్ నేత జానారెడ్డి, పార్టీ కార్యదర్శి బోసురాజులు హైకమాండ్ పిలుపుతో హస్తినకు వెళ్లారు
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాను కేసీఆర్ పై యుద్ధం చేయబోతున్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు కోమటిరెడ్డి. రాజగోపాల్ రెడ్డి
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలో కాక రేపుతున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతుండగా... రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని సీఎల్పీ నేత తెలిపారు. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారిపోయింది.
Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన పార్టీ మారుతారని దాదాపు ఏడాదిన్నరగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని కామెంట్ చేస్తూ వస్తున్నారు.
CM KCR: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త కాక రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుందనే ప్రచారం సాగుతోంది.
Komatireddy Brothers:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. వలసలు జోరందుకున్నాయి. చేరికల కోసమే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తించి తమ పార్టీలో చేరేలా ప్రయత్నిస్తున్నాయి.
AMITSHA: కమలం పార్టీ కోమటిరెడ్డితో కొత్త గేమ్ మొదలుపెట్టబోతుందని.. అటు కేసీఆర్ కు సవాల్ విసరడంతో పాటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా అమిత్ షా వ్యూహం సిద్ధమైందని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే తెలంగాణలో తమకు అధికారం ఖాయమనే ధీమాలో కమలనాథులు ఉన్నారని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.