Uddhav Thackeray Resigned: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షపై స్టే కోరుతూ ఉద్ధవ్ థాకరే సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.
Mumbai Explosives case: ముంబైలో కారుబాంబు కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సందేహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును ఏటీఎస్ విచారణ చేస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
Uddhav thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అనే హక్కు బీజేపీకు లేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై సమాధానం చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దసరా ర్యాలీ సందర్భంగా పరోక్షంగా ఆమె కామెంట్లకు దీటైన సమాధానమిచ్చారు.
విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.
షిర్డీ సాయి బాబా జన్మస్థలమైన పత్రిని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనపై షిర్డీ వాసులు తీవ్రం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సాయి బాబా బతికున్నంత కాలం షిర్డీలోనే గడిపాడని.. ఆయన జన్మస్థలం గురించి ఎప్పుడూ ఊసెత్తలేదని.. అటువంటప్పుడు ఇప్పుడు పత్రిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సర్కార్ ప్రకటించడం ఏంటంటూ షిర్డీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇదే విషయమై శనివారం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని జనవరి 19న బంద్ చేపడతామని షిర్డీ గ్రామ పంచాయతీ ప్రకటించింది.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
ఉద్ధవ్ థాకరే గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో గత కొన్ని వారాలుగా ఆ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది.
శివ సేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ లేఖ రాశారు.
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాత్రి 8 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహారాష్ట్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.