Mumbai Explosives case: ముంబై కారుబాంబు కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర అభ్యంతరం

Mumbai Explosives case: ముంబైలో కారుబాంబు కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సందేహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును ఏటీఎస్ విచారణ చేస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2021, 09:02 PM IST
  • ముంబైలో అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్ధాలున్న కారు కేసుపై వ్యాఖ్యానించిన ఉద్దవ్ థాకరే
  • కారు కేసును ఏటీఎస్ నుంచి ఎన్ఐఏకు అప్పగించడాన్ని తప్పుబట్టిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
  • ఎన్ఐఏకు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం చేసిన థాకరే
Mumbai Explosives case: ముంబై కారుబాంబు కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర అభ్యంతరం

Mumbai Explosives case: ముంబైలో కారుబాంబు కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సందేహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును ఏటీఎస్ విచారణ చేస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ముంబైలో ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani)ఇంటికి సమీపంలోని కారులో పేలుడు పదార్ధాలు (Mumbai car bomb case)బయటపడటం సంచలనమైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదే కేసులో ఆ వాహన యజమాని మాన్‌సుఖ్ హీరన్ అనుమానాస్పదంగా మృతి చెందడం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. మాన్‌సుఖ్ హీరన్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్ఐఏ(NIA) దర్యాప్తుకు ఆదేశించారు. ఇటు కేంద్రం ఈ సంఘటనపై స్పందించి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.

ప్రాధాన్యత కలిగిన కేసును తమ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ATS)దర్యాప్తు చేస్తుండగా..ఎన్ఐఏకు అప్పగించడం అనుమానాస్పదంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Maharashtra cm uddhav thackeray)తెలిపారు. ఇప్పటికే ఏటీఎస్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందన్నారు. అటువంటప్పుడు కేంద్ర హోంశాఖ ఇన్వెస్టిగేషన్ పేరుతో జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వాలనేవి వస్తుంటాయి..పోతుంటాయని..అధికార యంత్రాంగం శాశ్వతంగా ఉంటుందని..దానిని నమ్మవలసి వస్తుందని చెప్పారు. విపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం( Maharashtra government) పట్ల విశ్వాసం లేదని విమర్శించారు . అలాంటప్పుడు పెట్రోలియం ఉత్పత్తులపైన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు కోరుతోందని కూడా ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి మాన్‌సుఖ్ హీరన్ మృతిలో అనుమానాస్పద అంశాలేవీ లేవని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.

Also read; Emergency 1975: ఇందిరా గాంధీ ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News