Etela Rajender Counter To Minister KTR: సీఎం కేసీఆర్ పరిపాలన గిరిజన, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ అని కేసీఆర్ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు భయపెట్టిస్తున్నాయని అన్నారు. గిరిజన మహిళపై జరిగిన దాడి చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుందన్నారు.
"షీ టీమ్ పెట్టినామని చెప్తున్నారు. అర్ధరాత్రి కూడా స్వేచ్చగా తిరగవచ్చని చెప్పారు. కానీ ఎల్‌బీ నగర్‌లో కూతురు పెళ్లి కోసం వెళ్ళి వస్తున్న మహిళను పోలీసులే తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. క్యారెక్టర్ లేని మహిళగా చిత్రీకరిస్తున్నారు. ఆమెను కొట్టిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో మహిళ మీద జరిగిన దౌర్జన్యం మీద సమాధానం చెప్పాలి. యావత్ తెలంగాణ గమనిస్తుంది. చెప్పరానిచోట్ల కొట్టిన తీరుపై స్పందించండి. చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటే సరిపోదు.
మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి భుమనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారు. దళిత, గిరిజన మహిళలపై జరుగుతున్న సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలి. పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం బేషరుతుగా క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ చేస్తున్న పనులని ప్రజలు మర్చిపోరు.. మర్లపడతారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో దళితబంధు.. డబుల్ బెడ్ రూం కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులను పెట్టీ అరెస్ట్ చేయించారు. పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడిపిస్తారు..?" అని ఈటల అన్నారు.
ఇప్పటివరకు ట్రైలర్ మాత్రమే చూశారు.. ఇక ప్రతిక్షాలకు సినిమా చూపిస్తామని అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా ఈటల కౌంటర్ ఇచ్చారు. సినిమా చూయించినా.. ట్రైలర్ చూయించినా.. చూయించేది నాయకులు కాదనని.. ప్రజలు అని అన్నారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు సినిమా చూడాల్సింది బీఆర్‌ఎస్ నాయకులు.. చూపించేది ప్రజలు అని చెప్పారు.
Also Read: Anasuya: వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం ఇదేనా..?
Also Read: Asia Cup 2003: ఈ నెల 21న ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. ఈ ప్లేయర్లు ఉంటారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook