Face Mask For Corona Virus: ప్రస్తుతం జేఎన్-1 వైరస్ విపరీతంగా విస్తరిస్తోంది.ఇప్పటికే దేశంలో గడిచిన 24 గంటల్లో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 4,440 ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతిఒక్కరు మాస్క్లు ధరించాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మార్కెట్లో వివిధ రకాల మాస్క్లు లభిస్తున్నాయి. ఎలాంటి మాస్క్ వేసుకోవడం వల్ల మనం వైరస్ బారిన పడకుండా ఉంటాం అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Surgical face mask or 5-layered mask: కరోనావైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలపై నిరంతంరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న తుంపర్లు (Droplets) నోటిలోంచి విడుదలైన మరుక్షణమే 5 సెకన్లలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని తేల్చిచెప్పిన ఐఐటి భుననేశ్వర్ (IIT Bhubaneswar) పరిశోధకుల బృందం.. అందుకే మాట్లాడేటప్పుడు సర్జికల్ మాస్క్ ధరించకూడదని సూచించింది.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమించకుండా ఉండటానికి భౌతిక దూరం ( Social Distance )తో పాటు మాస్క్లు తప్పకుండా ధరించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా రకరకాల మాస్క్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.