PF Contribution: మీ కంపెనీ పీఎఫ్‌ ఖాతాలోకి డబ్బులు జమ చేయట్లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి

How To Complaint EPFO: ఇటీవల కొన్ని కంపెనీలు పీఎఫ్‌ కట్ చేసినటలు పే స్లిప్స్‌లో చూపిస్తున్నా.. ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలోకి మాత్రం జమ చేయట్లేదు. ఈ విషయంపై ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈపీఎఫ్‌ఓకు సరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. మీ డబ్బులు తిరిగి పొందొచ్చు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 5, 2023, 07:03 PM IST
PF Contribution: మీ కంపెనీ పీఎఫ్‌ ఖాతాలోకి డబ్బులు జమ చేయట్లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి

How To Complaint EPFO: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారి జీతంలో 12 శాతం కట్ చేసి.. ఉద్యోగి పేరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) ఖాతాలో యాజమాన్యం జమ చేస్తుంది. ఈ 12 శాతానికి కంపెనీగా తన వాటా కింద జమ చేయాలి. ఇందులో 8.33% ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్ కింద జమ అయితే.. మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్‌ అకౌంట్‌లోకి చేరుతుంది. పీఎఫ్‌ ఖాతాలలోకి నెలవారీ డిపాజిట్ల గురించి చందాదారులకు ఈపీఎఫ్‌ఓ అప్‌డేట్ చేస్తూ.. ఎస్‌ఎంస్‌లు పంపుతుంది. అయితే ఇటీవల బైజుస్ వంటి కొన్ని కంపెనీలు.. ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్‌ అకౌంట్లలోకి డబ్బులు డిపాజిట్‌ చేయడం లేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా తమ పీఎఫ్‌ ఖాతాల్లో డబ్బులు జమ కావట్లేదని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా పనిచేసే కంపెనీ పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్ చేయకపోతే ఏం చేయాలి..? ఎవరికి ఫిర్యాదు చేయాలి..? ఇక్కడ తెలుసుకోండి.
 
ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ ​​పోర్టల్‌కు లాగిన్ చేయడం ద్వారా లేదా ఉమాంగ్ యాప్ ద్వారా లేదా మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. యజమాని ప్రతి నెలా ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో ఈపీఎఫ్‌ కోసం చేసిన మినహాయింపులను తప్పనిసరిగా జమ చేయాలి. యజమాని గత నెలలో చెల్లించిన జీతం నుంచి 15 రోజులలోపు డబ్బులను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను జమ చేయకపోతే.. యజమానిపై ఉద్యోగులు ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిర్యాదు నమోదు చేసిన తరువాత రిటైర్‌మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ విచారణ చేపట్టనుంది. ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని మినహాయించినప్పటికీ డిపాజిట్ చేయలేదని విచారణలో తేలితే సంబంధిత యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

కంప్లైంట్‌ను ఫైల్ చేయడానికి.. మీ శాలరీ నుంచి పీఎఫ్‌ డిడక్షన్స్ కట్ అయినా.. ఈపీఎఫ్‌ అకౌంట్‌లో డిపాజిట్ కానట్లు చూపించేలా ప్రూఫ్స్ సమర్పించాల్సి ఉంటుంది. శాలరీ పే స్లిప్‌లు, ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌ను అందించి ఫిర్యాదును నమోదు చేయవచయచు. ఈపీఎఫ్ఓ గ్రీవెన్సెస్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. EPFIGMS పోర్టల్‌కి లాగిన్ అయి.. యూఏఎన్ వివరాలు, పీఎఫ్‌కు జమ కాలేదని ఆధారాలు అందజేయండి. ఫిర్యాదు నిజమని తేలితే.. మీకు వడ్డీతో సహా చెల్లించాలని కంపెనీకి ఆదేశాలు జారీ చేయడంతోపాటు కాంట్రిబ్యూషన్స్ చేయని దానికి శిక్షగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. 

Also Read: How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి  

Also Read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News