Chandrababu Naidu Offer To Vangaveeti: కాపు సామాజికవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న వంగవీటి రాధకు చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారని సమాచారం. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక స్థానంలో రాధకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. రాధను మంత్రివర్గంలో చేర్చుకుని కాపు సామాజికవర్గాన్ని తన వైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఓ బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ ఈ హత్యపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని సంచలన ప్రకటన చేశారు. తాజాగా అదే విషయాన్ని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. 'వంగవీటి రంగాను చంపించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. ఈ విషయం రంగా కుమారుడికి, ప్రజలందరికీ తెలుసు' అని ప్రకటించారు.
Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన రంగా పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఓ వర్గానికి బ్రాండ్‌గా మారారు. రంగా అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాడారు. అందరివాడయ్యారు. ఆయన ఈ భూమిని వీడి 34 ఏళ్ళు దాటినా...
Janasena Party: పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం అనుపాలెంలో వంగవీటి రంగా విగ్రహాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వైఎస్సార్ కాపు నేతలు సన్నాహాలు చేశారు. అయితే వైసీపీ కాపు నాయకులను జనసైనికులు అడ్డుకున్నారు.
AP new districts: విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాకు మహానేత వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో రేపు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
Chandrababu Naidu on Vangaveeti Radha issue: తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల వంగవీటి రాధా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. రాధా హత్యకు కుట్ర పట్ల సమగ్ర విచారణ జరపాలని కోరుతూ తాజాగా చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.