Apple Price Cut: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ త్వరలో 15 ఇంచెస్ మ్యాక్‌బుక్ లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న 13 ఇంచెస్ మ్యాక్‌బుక్ విత్ ఎం2 చిప్ ధరను తగ్గిస్తూ ఆపిల్ కంపెనీ అధికారిక ప్రకటన జారీ చేసింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-WWDC 2023లో ఆపిల్ కంపెనీ ఇప్పటికే మ్యాక్‌బుక్ 15 ఆవిష్కరించింది. అదే సమయంలో మ్యాక్‌బుక్ 13 ధర తగ్గింపు ప్రకటన చేసింది.
మ్యాక్‌బుక్ 13 ఇంచెస్ 256 జీబీ వేరియంట్ ఇప్పుడు 1,14,900 రూపాయలుంది. అదే సమయంలో 512 జీబీ టాప్ ఎండ్ వేరియంట్ 1, 44,900 రూపాయలుంది. ధరలు తగ్గించకముందు 256 జీబీ వేరియంట్ మ్యాక్‌బుక్ 13 ధర 1,19, 900 కాగా 512 జీబీ వేరియంట్ మ్యాక్‌బుక్ 13 ధర 1,49, 900 రూపాయలు. అంటే ఒక్కొక్క మోడల్‌పై కంపెనీ 5000 రూపాయలు తగ్గించింది. అదే సమయంలో మ్యాక్‌బుక్ ఎయిర్ 13 ఎం1 చిప్ ధర 99,900 రూపాయలే ఉంది.
ఆపిల్ కంపెనీ నిన్న అంటే జూన్ 5వ తేదీన మ్యాక్‌బుక్ 15 ఇంచెస్ ప్రవేశపెట్టింది. ఇందులో 15.3 ఇంచెస్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే, ఎం2 చిప్, 18 గంటల బ్యాటరీ ఉంటాయి. టెక్నాలజీ, రిజల్యూషన్, బ్యాటరీ, పని తీరు, సేఫ్టీ అండ్ సెక్యురిటీ పరంగా మ్యాక్‌బుక్ 15 కచ్చితంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ల్యాప్‌టాప్‌గా నిలుస్తోంది. మ్యాక్‌బుక్ 15 ధర 134,900 రూపాయల నుంచి ప్రారంభం కానుంది. అదే ఎడ్యుకేషన్ కోసమైతే 1,24,900 రూపాయల్నించి మొదలవుతుంది.
ఆపిల్ కంపెనీ మ్యాక్‌బుక్ ఎయిర్ 15తో పాటు న్యూ మ్యాక్ స్టూడియో, మ్యాక్ ప్రోలు కూడా లాంచ్ చేసింది. మ్యాక్ స్టూడియో ధర 2,09,900 రూపాయలు కాగా, మ్యాక్ ఎడుక్యేషన్ ధర 1,88,900 రూపాయలుంది. అదే సమయంలో మ్యాక్ ప్రో హై ఎండ్ 7,29,900 కాగా, మ్యాక్ ప్రో ఎడ్యుకేషన్ 6,87,900 రూపాయలుంది.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook