Best Smartphone Under 20000: కొత్త సంవత్సరం కారణంగా అన్ని ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌తో ఎలక్ట్రిక్ వస్తువులను విక్రయిస్తున్నాయి. అమెజాన్‌లోనైతే బంపర్ డీల్ పేరుతో అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో మొత్తం ఎలక్ట్రిక్ వస్తువులు చాలా చౌకగా లభించనున్నాయి. ముఖ్యంగా ఈ డీల్‌లోOnePlus మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తున్నాయి. అయితే మీరు ఈ ఫోన్‌ను ఈ డీల్‌లో కొనుగోలు చేస్తే MRP ధర కంటే చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్స్‌లో మొబైల్ కొనుగోలు చేస్తే సాధారణ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
OnePlus 10R 5జీ 12జీబీ ర్యామ్ కలిగిన మొబైల్ ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 42,999 కాగా అమెజాన్‌లో బంపర్ డీల్ కారణంగా రూ.38,999కి లభిస్తోంది. అయితే ఇంకా డిస్కౌంట్ పొందడానికి మీరు ICICI బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే దాదాపు రూ. 3,000 ఫ్లాట్ తగ్గింపు కూడా లభిస్తుంది. కాబట్టి చాలా తక్కువ ధరలోనే మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే క్రెడిట్ కార్డుల ద్వారా బిల్ పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీ పాత మొబైల్ కండీషన్ బట్టి అప్లికెబుల్ అవుతుంది. మీరు వినియోగిస్తు ఫోన్ కండిషన్ బాగుంటే రూ.15,200 తగ్గించవచ్చు. ఈ ఫోన్‌పై నో-కాస్ట్ EMIపై కూడా ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే అన్ని ఆఫర్లు పోను దీని ధర రూ. 20,799 లభించనుంది.
OnePlus 10R 5జీ ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లు:
OnePlus కంపెనీ ఫోన్స్ అన్ని 1080x2412 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ 10-బిట్ AMOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా సఫోర్ట్ చేస్తుంది. HDR10+ ఫీచర్ కారణంగా ఫోటో నాణ్యత మరింత అద్భుతంగా వస్తుంది. డిస్‌ప్లే ప్రోటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కూడా అందుబాటులో ఉంది.
ఈ 5G ఫోన్ సపోర్ట్‌తో 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నాల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కాగా.. 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి.
Also Read: Ind Vs SL: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!
Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి