BSNL 4G : గేమ్ ఛేంజర్‎లా మారిన బీఎస్ఎన్ఎల్ 4జీ...అత్యంత చవక ప్లాన్లతో మార్కెట్లో భూకంపం..!!

BSNL 4G  :  కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ సర్కార్..బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా వేగవంతమైన, చౌకన్ ఇంటర్నెట్ ప్లాన్స్ అందించనున్నట్లు ప్రకటించడంపై ఆశలు రేకెత్తించింది.    

Written by - Bhoomi | Last Updated : Aug 15, 2024, 05:52 PM IST
BSNL 4G : గేమ్ ఛేంజర్‎లా మారిన బీఎస్ఎన్ఎల్ 4జీ...అత్యంత చవక ప్లాన్లతో మార్కెట్లో భూకంపం..!!

BSNL 4G Service : కేంద్రంలోని మోదీ సర్కార్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ను సేవలను  దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. అంతేకాదు  పోస్ట్‌లో స్క్రీన్‌షాట్ ను షేర్ చేస్తూ త్వరలోనే బీఎస్ఎన్ఎల్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది. 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ఊరటనిస్తుంది. ఎందుకంటే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఖరీదైన ప్లాన్‌లతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో బీఎస్ఎన్ఎల్ నుంచి అత్యంత చౌక ప్లాన్లతో 4జీ సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. BSNL 4జీ నెట్‌వర్క్ వినియోగదారులకు ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. 

4G రోల్‌అవుట్ అయిన 6 నుండి 8 నెలలలోపు 5G సేవను ప్రారంభించే ప్లాన్ ఉన్నట్లు సమాచారం.  తాజాగా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా BSNLకి 5G కాల్ చేశారు. ఆ తర్వాత 5G గురించి చర్చ జోరందుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా 6జీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. కొన్ని రాష్ట్రాల్లో BSNL 4G సేవ ఇంకా ప్రారంభం కాలేదు. క్రమంగా ఈ సర్వీసులను రాష్ట్రాలకు విస్తరిస్తోంది. 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన ప్రగతి గురించి వెల్లడించారు. దేశం వేగంగా 5జీని ప్రారంభించిందని, ఇప్పుడు మిషన్ మోడ్‌లో 6జీ టెక్నాలజీపై పనిచేస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ రంగంలోని ప్రతిభను కూడా ఆయన నొక్కి చెప్పారు.

Also Read: PSU Stock : ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ.2 లక్షలు లభించేవి  

కాగా BSNL 4G ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించలేదు. కానీ ఇది నెమ్మదిగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే  15 వేల కొత్త టవర్లను ఏర్పాటు చేయగా మిగిలిన టవర్ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.కాగా ఐటీ దిగ్గజాలలో ఒక్కటి అయిన టీసీఎస్ తో కలిసి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థ సి డాట్ డెవలప్ చేసిన యాజమాన్య సాంకేతికతను ఉపయోగించి బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ ను విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్ నుంచి టీసీఎస్ , తేజస్ ప్రభుత్వ రంగ ఐటీఐ సంయుక్తంగా 19వేల కోట్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 1.12లక్షల 4జీ , 5జీ టవర్ ను ఇన్ స్టాల్ చేసింది. 

Also Read: CIBIL score : ఈ ఒక్క తప్పు చేశారో మీరు లోన్ తీసుకోకపోయినా మీ సిబిల్ స్కోర్ 500కు పడిపోవడం ఖాయం  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News