Twitter New Feature: ట్విట్టర్ లో రానున్న మరో అద్భుతమైన ఫీచర్..

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ లలో ట్విట్టర్ కూడా ఒకటి. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత ట్విట్టర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇపుడు కొత్తగా వీడియో కాలింగ్ ఫీచర్ రావటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2023, 04:30 PM IST
Twitter New Feature: ట్విట్టర్ లో రానున్న మరో అద్భుతమైన ఫీచర్..

New Feature in Twitter: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆధరణ ఉన్న సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్విట్టర్‌ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ప్రముఖులు, సెలబ్రెటీలు, ప్రముఖ సంస్థలు వినియోగించే సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ట్విట్టర్ ను వినియోగిస్తారు. ట్విట్టర్ ను ఒకప్పుడు ప్రొఫెషనల్‌ గా మెయింటెన్ చేసే వారు. ఎప్పుడైతే ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడో అప్పటి నుండి మొత్తం మారి పోయింది.

ట్విట్టర్‌ ను కమర్షియల్ గా మార్చేసిన ఆయన రోజు రోజు ఒక మార్పును తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే ట్విట్టర్‌ ను ఎక్స్ అంటూ పేరు మార్చి, కొత్త లోగోతో వచ్చిన మస్క్ బ్లూ టిక్ విషయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకుని అందరి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా తాను వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా తన నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. 

వినియోగదారుల సౌకర్యార్థం అంటూ చాలా రకాలుగా ట్విట్టర్ లో మార్పులు తీసుకు వస్తున్న మస్క్ తాజాగా తీసుకు వచ్చిన మరో ఫీచర్ తో ఇదెక్కడి గొడవరా బాబు... ఇవన్ని ఎందుకు అంటూ కొందరు జుట్టు పీక్కుంటున్నారు. మెల్లగా ట్విట్టర్ ను వదిలేసి వెళ్తాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే కొత్తగా వచ్చిన ఫీచర్‌ ను అవసరం ఉంటే వాడుకోవాలి లేదంటే వదిలేయాలి. అంతే కాని ఎందుకు రాద్దాంతం చేస్తారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో ట్విట్టర్ కొత్త ఫీచర్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం నుండి మరింత స్పష్టత కోసం నెటిజన్స్ మరియు వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. 

Also Read: Shani Dev: అధికమాస అమావాస్య రోజున ఇలా చేస్తే శని సాడే సతి వల్ల కలిగే నష్టాలన్నీ మాయం..  

ఇప్పుడు ట్విట్టర్ లో వీడియో కాలింగ్‌ ఆప్షన్ ను తీసుకు రావడం జరిగింది. ట్విట్టర్ ను సూపర్‌ యాప్ గా మార్చే ఉద్దేశ్యంతో ఈ వీడియో కాల్‌ ఆప్షన్‌ ను తీసుకు రావడం జరిగింది. ట్విట్టర్ లో ఎన్నో మార్పులు వచ్చినా కూడా ఇలాంటి ఒక ఫీచర్‌ వస్తుందని ఏ ఒక్కరు ఊహించి ఉండరు. కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకు వస్తున్న సంస్థ యాజమాన్యం ముందు ముందు భారీ మొత్తం లో వినియోగదారులకు డబ్బు వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది.

యాడ్స్ లో షేర్‌ ను వినియోగదారులకు ఇవ్వడం ద్వారా మరింతగా కంటెంట్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రోత్సహం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ లో మారుతున్న ఫీచర్స్ వస్తున్న కొత్త ఆఫర్ లను చూస్తూ ఉంటే ట్విట్టర్ ముందు ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో ఊహించలేక పోతున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News