JIO New Recharge Plans: గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఇండియన్ ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో.. నెట్ ఫ్లిక్స్.. జీ5.. హాట్ స్టార్ ఇంకా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ ఎత్తున డబ్బును ఖాతాదారుల నుండి వసూళ్లు చేస్తోంది. ఒకప్పుడు నామమాత్రపు రేట్లు ఉన్న ఓటీటీ సబ్ స్క్రిప్షన్ రేటు ఇప్పుడు అమాంతం పెరిగి పోయింది. వినియోగదారులు పెరిగి పోవడంతో పాటు పెద్ద ఎత్తున కంటెంట్ ను అందిస్తున్న కారణంగా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు జియో సినిమా ఓటీటీ మాత్రం కంటెంట్ మొత్తంను కూడా ఉచితంగా ఇస్తుంది. జియో సినిమా ప్రస్తుతం ఐపీఎల్ ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జియో సినిమా ఓటీటీకి భారీ ఎత్తున క్రేజ్ దక్కింది.
రిలయన్స్ వారు ఎప్పుడైనా ఒక ప్రాడెక్ట్ ను జనాలకు అలవాటు చేస్తారు.. జనాలు ఆ ప్రాడెక్ట్ కు అలవాటు పడ్డ తర్వాత రేటును పెంచడం చేస్తూ ఉంటారు. అంతకు ముందు వరకు ఉచితంగా ఇవ్వడం లేదంటే చాలా తక్కువ రేటుకు అవ్వడం ద్వారా పాపులారిటీ దక్కుతుంది. ఇప్పుడు జియో సినిమా ఓటీటీ విషయంలో కూడా అదే జరుగబోతుంది. ఇన్నాళ్లు ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను కూడా జియో సినిమాలో ఉచితంగా స్క్రీనింగ్ చేయడం ద్వారా ఓటీటీకి మంచి పాపులారిటీ దక్కేలా చేశారు. ఇప్పుడు జియో సినిమా ను ఉచితం కాదు అనేందుకు సిద్ధం అయ్యారు. అధికారికంగా జియో సినిమా ఓటీటీ ప్లాన్స్ పెట్టబోతుంది.. రుసుము వసూళ్లు చేయబోతుంది అనే విషయమై క్లారిటీ రాలేదు కానీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
జియో సినిమా ప్రారంభ రుసుము అతి తక్కువగా వసూళ్లు చేయబోతుంది. ఈ ఓటీటీ ని జనాలు ఆధరించి.. కంటెంట్ పట్ల ఆసక్తి చూపించే వరకు జియో సినిమా ఓటీటీ ప్లాన్స్ చాలా తక్కువగా ఉండబోతున్నాయట. కనీసం ఏడాది పాటు తక్కువ మొత్తంలో ప్లాన్స్ ను అందించబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ఓటీటీ లో లేని డైలీ ప్లాన్ ను జియో సినిమా తీసుకు రాబోతుంది. ఒక్క రోజుకు 29 రూపాయలుగా ఖరారు చేసింది. అయితే ప్రారంభం ఆఫర్ గా కేవలం రూ.2 లకే 24 గంటల సబ్ స్క్రిప్షన్ ను అందించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Ram Charan Game Changer : గేమ్ చేంజర్ సెట్స్ నుంచి లీక్.. గన్నుతో ఫైట్ మాస్టర్ ఫీట్స్
ఇక గోల్డ్ స్టాండర్డ్ ప్లాన్ ధరను రూ.299 గా ఖరారు చేయడం జరిగింది. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు ఓటీటీ లోని మొత్తం కంటెంట్ ను యాక్సెస్ చేసుకునే విధంగా జియో సినిమా ప్లాన్ ను ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ ప్లాన్ ను ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందించబోతున్నారు. అంటే మూడు నెలలకు కేవలం 99 రూపాయలే అన్నమాట. ఇక మూడవ ప్లాన్ ఏడాది ప్లాన్. ప్రీమియం ప్లాన్ గా పేర్కొంటున్న ఈ ప్లాన్ కు రూ.1199 చెల్లించాల్సి ఉంటుందట. అయితే ప్రారంభ ఆఫర్ కింద సగం చెల్లిస్తే చాలు. అంటే రూ.599 లకే ఏడాది పాటు జియో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట.
మొత్తానికి జియో సినిమా కొత్త ప్లాన్స్ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జనాల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలయన్స్ వారు ఏం చేసినా కూడా అక్కడ సూపర్ హిట్.. సూపర్ సక్సెస్ లను దక్కించుకోవడం ఖాయం అని ఇప్పటికే పలు రంగాల్లో వారు దూసుకు పోతున్న విషయాన్ని చూస్తే అర్థం అవుతుంది. అందుకే జియో సినిమా లో కొత్త కంటెంట్ మరియు కొత్త సినిమాలను తీసుకు వస్తే సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తే పెద్ద ఎత్తున ఖాతాదారులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జియో సినిమా ప్లాన్స్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.